BigTV English

Comedian Visweswara Rao: ఇండస్ట్రీలో వరుస మరణాలు.. ఇప్పటికీ ముగ్గురు

Comedian Visweswara Rao: ఇండస్ట్రీలో వరుస మరణాలు.. ఇప్పటికీ ముగ్గురు


Comedian Visweswara Rao: టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిన్నటి నుంచి ఇండస్ట్రీకి చెందినవారు వరుసగా కన్నుమూస్తున్నారు. ఇప్పటికే అనువాద రచయిత రామకృష్ణ, ప్రముఖ చిత్రకారుడు, కాస్ట్యూమ్ డిజైనర్ దాసి సుదర్శన్ కన్నుమూసిన సంగతి తెల్సిందే. వీరి మరణ వార్తలను జీర్ణించుకోకముందే మరో నటుడు కన్నుమూశాడు. ప్రముఖ కమెడియన్ విశ్వేశ్వరరావు(62) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం చెన్నై సమీపాన సిరుశేరిలోని ఆయన నివాసంలో ఉంచారు.

విశ్వేశ్వరరావు చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ను ప్రారంభించారు. స్టార్ హీరో సినిమాల్లో మంచి పాత్రలు చేశారు. దాదాపు 300 కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా వంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ద్వారా విశ్వేశ్వరరావు ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు.


ఆమె కథ, ఆయనకు ఇద్దరు, అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి, మెకానిక్ అల్లుడు, శివాజీ, అవును.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. ఇలా ఎన్నో మంచి చిత్రాల్లో ఆయన నటించారు. సినిమాలే కాకుండా సీరియల్స్ లో కూడా విశ్వేశ్వరరావు నటించాడు. కొన్ని సినిమాలకు దర్శక నిర్మతగా కూడా వ్యవహరించారు. వయస్సు మీద పడుతున్న సమయంలో సినిమాలు, సీరియల్స్ ఆపేసి.. విస్సు టాకీస్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్ ను రన్ చేస్తున్నారు. అందులో తన అనుభవాలను, జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఉంటారు. ఇక ఆయన మరణ వార్త విన్న పలువురు ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు.

Related News

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

Big Stories

×