BigTV English

SSMB29: మహేష్ కు విలన్ గా సలార్ విలన్.. కన్ఫర్మ్.. ?

SSMB29: మహేష్ కు విలన్ గా సలార్ విలన్.. కన్ఫర్మ్.. ?

SSMB29: ప్రేక్షకులు అందరూ ఎదురుచూసిన కల్కి కూడా థియేటర్ లోకి వచ్చేసింది. కానీ, రెండేళ్ల క్రితం అనౌన్స్ చేసిన SSMB29 మాత్రం ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందా.. ? అని అభిమానులు కళ్ళలో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ విజయం తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో SSMB29 ను అధికారికంగా అనౌన్స్ చేశాడు.


టాలీవుడ్ కు మాత్రమే కాదు పాన్ ఇండియా లెవెల్ లో జక్కన్న ఒక బ్రాండ్. అలాంటి దర్శకుడు చేతిలో సూపర్ స్టార్ పడ్డాడు అంటే.. ఎన్ని అంచనాలు ఉంటాయో అందరికి తెల్సిందే. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్ మెంట్ నే ఒక ట్రెండ్ సృష్టించింది. ఈ సినిమాకు సంబంధించిన ఏ వార్త అయినా క్షణాల్లో వైరల్ గా మారుతోంది.

ప్రస్తుతం ఈ సినిమా గురించి చెప్పాలంటే.. ఒకపక్క స్క్రిప్ట్ పని జరుగుతుంది.. ఇంకోపక్క మహేష్ లుక్ సెట్ చేసుకొనే పనిలో ఉన్నాడు. మరోపక్క రాజమౌళి క్యాస్టింగ్ ను వెతికే పనిలో ఉన్నాడు. ఎప్పటినుంచో ఈ చిత్రంలో మహేష్ కు ధీటైన విలన్ కోసం రాజమౌళి వెతుకుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఎట్టకేలకు ఆ విలన్ దొరికేసాడని టాక్ నడుస్తోంది.


హీరోగా, విలన్ గా తనదైన నటనతో అలరిస్తున్న మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ను జక్కన్న విలన్ గా కన్ఫర్మ్ చేసినట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. సలార్ సినిమాలో వరదరాజ మన్నార్ పాత్రలో పృథ్వీరాజ్ నటన ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఇక వరదరాజ మన్నార్- సలార్ మధ్య అసలు సిసలైన యుద్ధం సలార్ 2 లో కనిపించనుంది.

ఇక ఆ నటనకు మెచ్చి.. జక్కన్న SSMB29లో కీలకమైన విలన్ రోల్ లో పృథ్వీరాజ్ అయితే బావుంటుందని ఆయనకు కథ చెప్పడం, వెంటనే ఆయన ఓకే అనడం కూడా జరిగిపోయింది అంట. ఇక ఈ సినిమాలో మహేష్ మోస్ట్ స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నాడట.. మోస్ట్ స్టైలిష్ హీరోకు మోస్ట్ స్టైలిష్ విలన్.. రాజమౌళి బాగా పకడ్బందీగా ప్లాన్ చేశాడని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×