BigTV English

Samantha: క్యాన్సర్ తో పోరాడుతున్న నటికి ధైర్యం చెప్పిన సామ్..

Samantha: క్యాన్సర్ తో పోరాడుతున్న నటికి ధైర్యం చెప్పిన సామ్..

Samantha: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత రెండేళ్లుగా ఈ చిన్నది మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో పోరాడుతుంది. ఇక ఆ వ్యాధి వలన ఆమె ఎంత నరకం అనుభవిస్తుంది అనేది ఆమెకు మాత్రమే తెలుసు. ఎనర్జీ కోసం స్టెరాయిడ్స్ తీసుకుంటుంది. నిత్యం చికిత్సలతో పాటు.. ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి జిమ్, యోగా లాంటివి చేస్తుంది. ఆమెకు ఈ వ్యాధి ఉందని తెలిసినప్పుడు.. ఇండస్ట్రీ మొత్తం సామ్ కు సపోర్ట్ గా నిలిచింది.


టాలీవుడ్ మాత్రమే కాకుండా బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా సామ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. ఆ అభిమానాన్ని సామ్ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూనే ఉంటుంది. తనలా వ్యాధులతో బాధపడేవారికి ఆమె కూడా సపోర్ట్ గా నిలబడుతుంది. తాజాగా బాలీవుడ్ సీరియల్  నటి హీనా ఖాన్ క్యాన్సర్ తో పోరాడుతున్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే ఆమె తన బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అభిమానులతో అధికారికంగా పంచుకుంది.

చికిత్స జరుగుతుందని, ఈ వ్యాధి నుంచి తాను బయటపడగలను అనే ధైర్యంతో ఉన్నానని చెప్పుకొచ్చింది. తాజాగా సామ్ సైతం.. హీనా ఖాన్ కు ధైర్యం అందించింది. నేడు హీనా .. కీమోథెరపీ సెషన్ కోసం ఆసుపత్రిలో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఇక ఈ పోస్ట్ కు సామ్ రిప్లై ఇస్తూ.. “నీ కోసం నేను ప్రార్థిస్తున్నాను. నువ్వు యోధురాలివి” అంటూ చెప్పుకొచ్చింది. తప్పకుండా ఆ బ్రెస్ట్ క్యాన్సర్ ను జయించి బయటకు వస్తావని ధైర్యం చెప్పింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.


సామ్ మంచి మనసుకు అభిమనులు ఫిదా అవుతున్నారు. ఇక సామ్ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం సిటాడెల్ రిలీజ్ కు రెడీ అవ్వగా.. మా ఇంటి బంగారం అనే సినిమా సెట్స్ మీద ఉంది. ఇవే కాకుండా బాలీవుడ్ లో ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోందని టాక్. మరి ఈ సినిమాలతో సామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Tags

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×