E-Paper
Advertisement

Priyanka Chopra: ప్రియాంక చోప్రాను వదలని డీప్ ఫేక్.. వీడియో వైరల్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాను వదలని డీప్ ఫేక్.. వీడియో వైరల్
Advertisement

Priyanka Chopra: డీప్ ఫేక్.. రష్మిక, అలియా భట్, కాజోల్, కత్రినా కైఫ్ ఇలా హీరోయిన్లంతా డీప్ ఫేక్ బారిన పడ్డారు. తొలుత రష్మిక డీప్ ఫేక్ వీడియో వైరల్ తో మొదలైన ఈ విషయం క్రమంగా బాలీవుడ్ భామలందరినీ కుదిపేస్తోంది. వారి డీప్ ఫేక్ వీడియోలు, ఫొటోలు విపరీతంగా వైరల్ అవ్వడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. దీనిపై కేంద్రం కూడా సీరియస్ అయింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీప్ ఫేక్ వీడియోలను చిత్రీకరించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు కూడా జారీ చేశారు. కానీ.. తాజాగా బాలీవుడ్ అగ్రహీరోయిన్ ప్రియాంక చోప్రా డీప్ ఫేక్ వీడియో వైరల్ అవ్వడం మళ్లీ ఆందోళన కలిగిస్తోంది.

ప్రియాంక చోప్రాకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో ప్రియాంక మాట్లాడిన ఓ వీడియోలో ఆమె ముఖాన్ని మార్చకుండా.. వాయిస్ ను మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒక నకిలీ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తున్నట్లు లిప్ సింక్ చేశారు. అలాగే వార్షిక ఆదాయాన్ని వెల్లడించినట్లు వీడియో రూపొందించారు. ఒక బ్రాండ్ కారణంగా 2023లో వార్షిక ఆదాయం భారీగా పెరిగిందని, అందరూ దానిని ఉపయోగించాలని ప్రియాంక చెప్పినట్లుగా ఆ వీడియోను క్రియేట్ చేశారు. ఈ వీడియో నెట్టింట హల్ చేస్తుండగా.. పలువురు స్పందిస్తూ.. ఇలా చేయడం చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీప్ ఫేక్ క్రియేట్ చేసే ఆకతాయిలపై చర్యలు తీసుకుంటున్నా.. ఆకతాయిలు భయపడటం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×