E-Paper
Advertisement

Telangana CM : సీఎం ప్రమాణస్వీకార ముహూర్తం మార్పు.. ఎప్పుడంటే..?

Telangana CM : సీఎం ప్రమాణస్వీకార ముహూర్తం మార్పు.. ఎప్పుడంటే..?
Advertisement
Political news today telangana

Telangana new CM news(Political news today telangana) :

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకార ముహూర్తం మారింది. గురువారం ఉదయం 10 గంటల 28 నిమిషాలకు ప్రమాణస్వీకారం కార్యక్రమం నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. తాజాగా ప్రమాణస్వీకార కార్యక్రమ సమయాన్ని మార్చారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట 4 నిమిషాలకు నిర్వహించాలని నిర్ణయించారు. AICC అగ్రనేతలను రావాలని ఆహ్వానించామని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ తెలిపారు. కేబినెట్ కూర్పుపై చర్చ జరగలేదన్నారు. పార్టీ సైనికుడిగా ఎలాంటి పాత్రనైనా పోషిస్తానని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు.

తెలంగాణ నూతన సీఎం ప్రమాణస్వీకారానికి హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వకార్యదర్శి‌ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, వివిధ శాఖల ఉన్నతాధికారులు అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. భద్రత, బందోబస్తు అంశాలపై డీజీపీ, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులను శాంతికుమారి వివరాలు‌ అడిగి తెలుసుకున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంపై ఎల్బీ స్టేడియంలో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమ ఏర్పాట్లపై కాంగ్రెస్‌ నేతలతో పోలీసు అధికారులు, సాధారణ పరిపాలనశాఖ అధికారులు చర్చించారు.

Telangana new CM news
Advertisement

అటు సచివాలయంలోనూ నూతన సీఎంకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. పోలీసులు ఇప్పటికే రిహార్సల్స్ కూడా చేస్తున్నారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×