BigTV English

Bunny Vasu: పెద్ద హీరోలు ప్రభాస్ ను చూసి నేర్చుకోండి.. ఫైర్ అయిన ప్రొడ్యూసర్!

Bunny Vasu: పెద్ద హీరోలు ప్రభాస్ ను చూసి నేర్చుకోండి.. ఫైర్ అయిన ప్రొడ్యూసర్!

Bunny Vasu: టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా సక్సెస్ అనుకున్న వారిలో గీత ఆర్ట్స్ 2 బ్యానర్ అధినేత బన్నీ వాసు(Bunny Vasu) ఒకరు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈయన ఇటీవల మరొక కొత్త నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. బి. వి వర్క్స్ అనే పేరుతో కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించడమే కాకుండా సరికొత్త అప్డేట్స్ కోసం వేచి చూడండి అంటూ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఇలా బన్నీ వాసు కొత్త నిర్మాణ సంస్థను ప్రకటించడంతో గీతా ఆర్ట్స్ లో ఈయనకు విభేదాలు తలెత్తాయని అందుకే గీత ఆర్ట్స్ నుంచి బయటకు వస్తున్నారనే వార్తలు కూడా బయటకు వచ్చాయి.


గీత దాటే ప్రసక్తి లేదు..

ఇలా గీత ఆర్ట్స్తో విభేదాలు అంటూ వస్తున్న వార్తలను బన్నీ వాస్తు పూర్తిగా ఖండించారు. తాను గీత దాటే ప్రసక్తే లేదని తెలియజేశారు.. ఇక ఇటీవల వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్న బన్నీ వాసు తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోల గురించి, వారి సినిమాల గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవల కాలంలో హీరోలందరూ కూడా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు . అలాగే ఒక్కో సినిమాకు కొన్ని వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు.. ఇక ఈ సినిమా త్వరగా విడుదల అవుతుందా అంటే అది లేదు. ఒక్కో సినిమాకు రెండు మూడు సంవత్సరాల సమయం తీసుకుంటున్నారు.


ఏడాదికి ఒక్క సినిమా…

ఇలా పాన్ ఇండియా సినిమా కోసం ఇతర భాష సెలబ్రిటీలను భాగం చేస్తూ ఒక్కో సినిమాకి రెండు మూడు సంవత్సరాలు ఎదురు చూస్తున్న నేపథ్యంలో నిర్మాతలు పూర్తిస్థాయిలో దెబ్బతినడమే కాకుండా థియేటర్ ఓనర్లు కూడా ఎన్నో ఇబ్బందులని ఎదుర్కోవాల్సి వస్తోంది. తాజాగా ఈ విషయం గురించి బన్నీ వాసు మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరూ కూడా ప్రభాస్(Prabhas) ని చూసి నేర్చుకోవాలని తెలిపారు. ప్రభాస్ సినిమాలు ఏడాదికి ఒకటి విడుదలవుతూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇక ఆయన లైన్ అప్ చూస్తే మాత్రం ప్రతి సంవత్సరం ఆ సినిమాలన్నీ విడుదల కాబోతున్నాయని తెలుస్తోంది.

నిర్మాతలకు నష్టాలు…

ఇలా ప్రభాస్ మాదిరిగా సినీ కెరియర్ ను మిగతా హీరోలందరూ ప్లాన్ చేసుకొని ఏడాదికి ఒక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తేనే  థియేటర్లు రెగ్యున్ అవుతాయని లేదంటే 100% థియేటర్లో రెగ్యూన్ కావని బన్నీ వాసు తెలిపారు. అయితే ఇలా ఒక్కో సినిమాకు రెండు మూడు సంవత్సరాలు సమయం తీసుకోవడం వల్ల నిర్మాతలు కూడా భారీ స్థాయిలో నష్టాలు అనే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకప్పుడు హీరోలు ఏడాదికి రెండు మూడు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేవారు. కానీ ఇప్పుడు మాత్రం  ఒక సినిమా కోసం 3 సంవత్సరాల వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక ఇటీవల ఇదే విషయం గురించి నిర్మాత బండ్ల గణేష్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరి ఇప్పటికైనా ఈ విషయంలో హీరోలు దర్శకుల తీరు మారుతుందా లేదా అనేది తెలియాల్సిందే.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×