BigTV English

Adam Milne – SKY : న్యూజిలాండ్ టీమ్ లో సూర్య…360 డిగ్రీ షాట్లతో రెచ్చిపోయాడుగా

Adam Milne – SKY :  న్యూజిలాండ్ టీమ్ లో సూర్య…360 డిగ్రీ షాట్లతో రెచ్చిపోయాడుగా

Adam Milne – SKY : టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అతను 360 డిగ్రీల్లో ఆడుతాడనే పేరు ఉంది. అయితే సూర్యకుమార్ యాదవ్ ని కూడా కొంత మంది క్రికెటర్లు ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా టెక్సాస్ సూపర్ కింగ్స్ తో మేజర్ లీగ్ క్రికెట్ 2025 సీజన్ కి సిద్ధమవుతున్నాడు న్యూజిలాండ్ క్రికెట్ స్టార్ ఆడమ్ మిల్నే. ఈ నేపథ్యంలోనే నెట్ ప్రాక్టిస్ లో భాగంగా భారత టీ-20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ “సుప్లా షాట్” ని పున:సృష్టిస్తున్నట్టు కనిపించాడు. మిల్నే విలక్షణమైన షాట్ కి ప్రయత్నించినప్పుడు అతని సహచరులు బ్యాటింగ్ టెక్నిక్ అసలైన మాస్టర్ గుర్తిస్తూ షాట్ సూర్య అంటూ గుర్తు చేశారు. ఈ షాట్ సూర్యకుమార్ యాదవ్ యొక్క ప్రపంచ  ప్రభావాన్ని చూపించిందనే చెప్పవచ్చు. అతనిలో దాగి ఉన్న బ్యాటింగ్ శైలి.. బౌండ్ స్కోరింగ్ అద్భుతమే అని చెప్పాలి. 


Also Read :  Anant Ambani – RCB : భారీ ధరకు RCBని కొంటున్న అంబానీ కొడుకు.. ఎన్ని కోట్లు అంటే ?

ముఖ్యంగా క్రికెట్ స్టేడియం లో అన్ని వైపులా బౌండరీలు, సిక్సులు బాదుతాడు. అందుకే అతనికి మిస్టర్ 360 అనే పేరు ఉంది. ప్రధానంగా సుప్లా షాట్ ప్రస్తుత క్రికెట్ లో అద్భుతమైన షాట్ గా భావిస్తారు. న్యూజిలాండ్ క్రికెటర్ మిల్నే ప్రాక్టీస్ సెషన్ రాబోయే టెక్సాస్ సూపర్ కింగ్స్ సన్నాహాల్లో ఉంది. మేజర్ లీగ్ క్రికెట్ 2025 సీజన్ లో మిల్నే ప్రధానంగా బౌలింగ్ కి ప్రసిద్ధి చెందాడు. అయితే ఈ నేపథ్యంలోనే ఒక బౌలర్ బ్యాటర్ మాదిరిగా సుప్లా షాట్ ప్రాక్టీస్ చేయడం అద్భుతమనే చెప్పాలి. మేజర్ లీగ్ క్రికెట్ 2025 సీజన్ లో  శాన్ ప్రాన్సిస్కో యూనికార్న్స్, వాషింగ్టన్ ఫ్రీడమ్, ఎం.ఐ. న్యూయార్క్, టెక్సాస్ సూపర్ కింగ్స్, LA నైట్ రైడర్స్, సీటెల్ ఓర్కాస్ ఈ ఆరు జట్లు పాల్గొంటాయి.ఈ జట్లలో టెక్సాస్ సూపర్ కింగ్స్ ఒకటి. 


భారత్ లో ఐపీఎల్ కి ఎంతటి క్రేజ్ ఉంటుందో న్యూజిలాండ్ లో MLC కి అంతటి క్రేజ్ ఉంటుంది. వాస్తవానికి ఈ ప్రపంచంలో ఐపీఎల్ కి ఉన్న క్రేజ్ మరే దేశంలో నిర్వహించే లీగ్ కి కూడా ఉండదు అనే చెప్పాలి. టీమిండియా ఆటగాళ్ల స్టైల్ ని ఇతర దేశాల ఆటగాళ్లు అనుసరించడం వల్ల వారి క్రేజ్ అమాంతం ఒక్కసారిగా పెరిగిపోతుంది. దీంతో టీమిండియా కి కూడా క్రేజ్ వస్తుంది. సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ 2025 సీజన్ లో ముంబై ఇండియన్స్ తరపున కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ప్రస్తుతం అతను అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ క్రికెటర్ మిల్నే ని ఐపీఎల్ లో 2015లో ఆర్సీబీ జట్టు కొనుగోలు చేసింది. కానీ గాయం కారణంగా ఆ సీజన్ లో ఆడలేకపోయాడు. ఆ తరువాత 2026, 2017 సీజన్లలో ఆడాడు. 2021లో ముంబై ఇండియన్స్, 2022లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ మాదిరిగా ఆడిన సుప్లా షాట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×