Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna )ప్రస్తుతం హీరోగా ప్రధాన పాత్రలలో సినిమాలు చేయకపోయినా పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవల స్టార్ హీరోలు అందరూ కూడా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ నాగార్జున మాత్రం సినిమాల విషయంలో కాస్త వెనకబడి ఉన్నారని చెప్పాలి. ఇక ఈయన చివరిగా నా సామిరంగా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్న నాగార్జున ఇప్పటివరకు సోలో హీరోగా ఎలాంటి సినిమాలను ప్రకటించలేదు. ప్రస్తుతం పలువురు స్టార్ హీరోల సినిమాలలో క్యామియో పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
సోలో హీరోగా….
ఇప్పటికే నాగార్జున కుబేర సినిమా(Kubera Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో ధనుష్(Danush) హీరోగా నటిస్తున్నప్పటికీ నాగార్జున కీలకపాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. అదేవిధంగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా నటిస్తున్న కూలి సినిమాలో కూడా నాగార్జున పవర్ ఫుల్ పాత్రలో నటించబోతున్నారనే విషయం అందరికీ తెలిసిందే. అతి త్వరలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాలతో పాటు డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతితో కూడా ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు భవతి భిక్షాందేహి అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు.
క్యామియో పాత్రలకే పరిమితమా…
ఇక ఈ సినిమాలో కూడా నాగార్జున ఒక కీలకపాత్రలో నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నా కానీ ఇప్పటివరకు ఈ విషయం గురించి ఎక్కడ అధికారక ప్రకటన మాత్రం తెలియచేయలేదు. ఇలా ఒక సమయంలో స్టార్ హీరోగా ఇండస్ట్రీని ఏలిన నాగార్జున సోలో హీరోగా కాకుండా స్టార్ హీరోల సినిమాలలో నటిస్తున్న నేపథ్యంలో అభిమానులలో కాస్త నిరాశ ఉంది. ఇక త్వరలోనే నాగార్జున నటించిన కుబేర సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా జూన్ 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్లను కూడా వేగవంతం చేశారు.
వెంకటేష్ ను అనుకున్నారా…
తాజాగా ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ ముంబైలో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో ధనుష్ ఒక బెగ్గర్ పాత్రలో కనిపించబోతున్న విషయాన్ని కూడా రివిల్ చేశారు. ఇక ఈ సినిమాలో నాగార్జున పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని సమాచారం. అయితే శేఖర్ కమ్ముల(Sekhar Kammula) ఈ పాత్రలో చేయడం కోసం ముందుగా నాగార్జునని కాకుండా మరొక స్టార్ హీరోని సంప్రదించారని తెలుస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న వెంకటేష్(Venkatesh) ఈ పాత్రలో నటిస్తే బాగుంటుందనుకున్న శేఖర్ కమ్ముల ముందుగా తనని అప్రోచ్ అవ్వాలనుకున్నారట, అయితే కొన్ని కారణాలవల్ల వెంకటేష్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో నాగార్జున ఈ సినిమాలో భాగమయ్యారని వార్తలు బయటకు వచ్చాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.