Ram Charan -Trivikram: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారి జాబితాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ముందు వరుసలో ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ భారీగా పెరిగిపోవడమే కాకుండా ఈయన తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ కో లీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee)తో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమా నుంచి ఇటీవల ఒక అప్డేట్ విడుదల చేశారు. ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించబోతున్నారని ప్రకటించారు. ఇకపోతే అల్లు అర్జున్ పుష్ప సినిమా తర్వాత డైరెక్టర్ అట్లీతో కాకుండా మరొక డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)తో సినిమా చేయాల్సిన విషయం మనకు తెలిసిందే. వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుంది అంటూ గతంలో అధికారకంగా కూడా ప్రకటించారు కానీ కొన్ని కారణాలవల్ల వాయిదా పడటం వల్లే అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్ట్ అట్లీతో కమిట్ అయ్యారు. ఇలా అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రామ్ చరణ్ (Ram Charan)తో సినిమా చేయబోతున్నారని వార్త కూడా బయటకు వచ్చింది.
త్రివిక్రమ్, అల్లు అర్జున్..
ఇలా ఈ విషయం గురించి తాజాగా ప్రొడ్యూసర్ బన్నీ వాసు(Bunny Vasu) ఒక ఇంటర్వ్యూకి హాజరయ్యారు ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయనకు ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలను బన్నీ వాసు చూసుకుంటారనే సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా ఎందుకు ఆలస్యం అయిందనే ప్రశ్న బన్నీ వాసుకు ఎదురైంది. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ.. వారిద్దరికీ ఉన్నంత అండర్ స్టాండింగ్, క్లారిటీ ఎవరికి ఉండదు వారిద్దరూ ఎప్పుడు స్టార్ట్ అని చెబితే అప్పుడు నేను ఆ సినిమా కోసం పని చేయడానికి రెడీగా ఉంటాను వారు చెప్పడమే ఆలస్యం అని బన్నీ వాసు తెలిపారు.
సెన్సిటివ్ మ్యాటర్…
ఇకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నారట కదా అంటూ మరొక ప్రశ్న ఎదురవడంతో ఇప్పటివరకు ఈ విషయం నా వరకు రాలేదని సమాధానం చెప్పారు. త్రివిక్రమ్ గారు నాతో పర్సనల్ గా ఎప్పుడు ఈ విషయాన్ని చెప్పలేదని బన్నీ వాసు తెలిపారు. అనంతరం బన్నీ వాసు మాట్లాడుతూ ఈ ప్రశ్న గురించి వదిలేయండి అసలు వేయకండి దీనిని అంటూ చెప్పారు ఇది చాలా సెన్సిటివ్ విషయం మీకు తెలుసు కదా శ్రీనివాస్ గారి గురించి. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఇక్కడితో ఆపేయండి అంటూ నిర్మాత బన్నీ వాసు త్రివిక్రమ్ శ్రీనివాస్ రామ్ చరణ్ సినిమా గురించి మాట్లాడటానికి ఏమాత్రం ఆసక్తి చూపించలేకపోయారని తెలుస్తోంది.