Allu Arjun:నిర్మాణ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న బన్నీ వాసు(Bunny Vasu) అంటే చెప్పనక్కర్లేదు. గీత ఆర్ట్స్ అంటే బన్నీ వాసు.. బన్నీ వాసు అంటే గీతా ఆర్ట్స్(Geeta Arts) అనేలా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అలాంటి బన్నీ వాసు మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి చాలా సన్నిహితుడు..ముఖ్యంగా అల్లు అరవింద్ (Allu Aravindh)తో ఎక్కువగా ఉంటూ అల్లు ఫ్యామిలీకి దగ్గరగా ఉంటారు. అలా అల్లు అర్జున్ (Allu Arjun)కి బన్నీ వాసు క్లోజ్ ఫ్రెండ్ కూడా.. అలా వీరి మధ్య ఎంతో మంచి సంబంధం ఉంది. అయితే వీరి మధ్య ఉన్న ఈ ఫ్రెండ్షిప్ గురించి ఎన్నో వార్తలు వినిపిస్తాయి. అలాగే ఒకరికి సంబంధించిన రహస్య విషయాలు మరొకరికి కచ్చితంగా తెలుస్తాయి. ఈ నేపథ్యంలోనే తండేల్ మూవీ(Tandel Movie)కి నిర్మాతగా చేసిన బన్నీ వాసు తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సమయంలో అల్లు అర్జున్ (Allu Arjun) రూ.300 కోట్ల రెమ్యూనరేషన్ పై ప్రశ్న ఎదురైంది.
పుష్ప 2 కోసం అల్లు అర్జున్ రెమ్యునరేషన్..
అయితే చాలా రోజుల నుండి పుష్ప-2 (Pushpa-2) కోసం అల్లు అర్జున్ రూ.300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడని, ఇండియాలో ఇదే హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అని ఎన్నో రూమర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ రూమర్ పై స్పందించారు బన్నీ వాసు. ఆయన తండేల్ (Thandel ) ప్రమోషన్స్ లో అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ పుష్ప-2 కోసం రూ.300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడని అంటున్నారు. కానీ ఒక హీరో రూ.100 కోట్లు తీసుకుంటే, అందులో 39% టాక్స్ కిందనే పోతుంది. వాళ్ళ ఇంటికి వచ్చేవి కేవలం రూ.60 కోట్లు మాత్రమే. ఇక చాలా మంది రూ.300 కోట్లు, రూ.300 కోట్లు అని మాట్లాడుకుంటున్నారే తప్ప ఆయన చాలా రోజుల నుండి ఆ సినిమాకి తప్ప వేరే సినిమాకి పనిచేయలేదు అనేది మాత్రం గుర్తు పెట్టుకోవడం లేదు. పుష్ప, పుష్ప -2 కోసం అల్లు అర్జున్ ఏకంగా ఐదు సంవత్సరాలను కేటాయించారు.
రూ.300 కోట్లపై బన్నీ వాసు క్లారిటీ..
ఈ ఐదు సంవత్సరాలలో ఆయన ఏ సినిమాకి కూడా వర్క్ చేయలేదు.ఒక్కో సంవత్సరం లెక్కన చూసుకున్నా కూడా ఒక సంవత్సరానికి ఒక్క సినిమా వేసుకున్నా కూడా ఆయన మార్కెట్ రేంజ్ ప్రకారం రూ.300 కోట్ల కంటే ఎక్కువగానే వచ్చేవి కదా.. దాని గురించి ఎవరూ మాట్లాడరా.. రూ. 300 కోట్లు మాత్రమే మాట్లాడుకుంటున్నారు. కానీ ఆయన ఎన్ని రోజులు ఆ సినిమాకి టైం కేటాయించారు అనేది మాత్రం మాట్లాడుకోరు. అలాగే రంగస్థలం (Rangasthalam) సినిమా తర్వాత సుకుమార్ ఈ రెండు సినిమాలే చేశారు. ఆయన కూడా ఈ సినిమాకి తప్ప మరో సినిమాకి వర్క్ చేయలేదు. అలాగే ఆయనకు సైడ్ బిజినెస్ లు కూడా ఏమీ లేవు. ఆ లెక్కలతో చూసుకుంటే ఈ లెక్కలు ఎంత అంటూ రెమ్యూనరేషన్ పై క్లారిటీ ఇచ్చారు బన్నీ వాసు. అలా అల్లు అర్జున్ రూ.300 కోట్లపై పరోక్షంగా ఐదు సంవత్సరాలు అల్లు అర్జున్ పుష్ప సినిమాకి కేటాయించారు. ఒకవేళ వేరే సినిమాల్లో చేస్తే కనీసం సంవత్సరానికి ఒకటి చేసిన ఒక్క సినిమాకు వంద కోట్లు వచ్చేవి కదా అన్నట్లు స్పందించారు బన్నీ వాసు(Bunny Vasu).. ఇక బన్నీ వాసు మాటలతో అల్లు అర్జున్ నిజంగానే రూ.300 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నట్టు కన్ఫామ్ అయిపోయింది.