BigTV English

Khaleja: అభిమానులే మహేష్ సినిమాని చంపేశారు… ఖలేజా సీక్వెల్ పక్కా!

Khaleja: అభిమానులే మహేష్ సినిమాని చంపేశారు… ఖలేజా సీక్వెల్ పక్కా!

Khaleja: ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ  రిలీజ్ (Re Release)ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ సరికొత్త ట్రెండ్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా నటించిన పోకిరి సినిమా నుంచి మొదలైంది. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారందరి సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ సినిమాలు తిరిగి థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను సందడి చేశాయి. అయితే త్వరలోనే మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించిన ఖలేజా(Khaleja) సినిమాని కూడా తిరిగి విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాను మే 30వ తేదీ తిరిగి విడుదల చేయబోతున్నారు.


ఖలేజా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి 15 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో తిరిగి ఈ సినిమాని విడుదల కాబోతున్న తరుణంలో ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఖలేజా సినిమాకి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు, అనుష్క శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం అప్పట్లో ప్రేక్షకులను పూర్తిస్థాయిలో నిరాశపరిచింది. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా విడుదలైనప్పటికీ నిర్మాతలకు మాత్రం నష్టాలు తప్పలేదని కళ్యాణ్ తెలిపారు..

అభిమానులే చంపేశారు..


ఇక ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్, టీజర్ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమా విడుదలకు ముందు మిడ్ నైట్ షో వేయాలని మహేష్ అభిమానులు కోరారు కానీ అందుకు నేను ఒప్పుకోలేదు. అయితే ఈ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న కారణంతో ఈ సినిమా గురించి పూర్తిగా అర్థం చేసుకునే లోపే మహేష్ అభిమానులు ఈ సినిమాని చంపేశారని, అప్పటికే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయిందని కళ్యాణ్ తెలిపారు. ఇలా థియేటర్లో ఈ సినిమా నష్టాలను ఎదుర్కొన్న బుల్లితెరపై మాత్రం ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.

ఖలేజా 2 రావటం పక్కా?
ఇప్పటివరకు టెలివిజన్లో ప్రసారమైనటువంటి సినిమాలలో ఖలేజా నెంబర్ వన్ స్థానంలో ఉండి సరికొత్త రికార్డులను సృష్టించిందని తెలిపారు. ఇలా టీవీలలో చూసిన ఎంతోమంది ప్రేక్షకులు ఈ సినిమాని బిగ్ స్క్రీన్ పై చూడటం కోసమే రీ రిలీజ్ చేయాలని కోరటం నాకెంతో ఆనందంగా ఉందని కళ్యాణ్ తెలిపారు. ఇక ఈ సినిమా మొదట్లో నష్టాలు వచ్చినప్పటికీ, ఇప్పుడు మాత్రం మంచి కలెక్షన్లనే రాబడుతుందని నేను భావిస్తున్నాను. నిజానికి ఈ సినిమా రీ రిలీజ్ కలెక్షన్లన్నీ మహేష్ బాబు చారిటీ కోసం ఇవ్వాలనుకున్నాను కానీ కొన్ని కారణాలవల్ల ఆ పని చేయలేకపోతున్నానని, అందుకు క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా నిర్మాత సి కళ్యాణ్ ఖలేజా సీక్వెల్ గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. త్రివిక్రమ్ గారు, మహేష్ బాబు ఓకే అంటే తాను ఖలేజా 2 (Khaleja 2) చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నానని నిర్మాత చెప్పడంతో మహేష్ బాబు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×