E-Paper
Advertisement

Yashoda : యశోదకు కోర్టు నోటీసులు.. నిర్మాత క్లారిటీ…

Yashoda : యశోదకు కోర్టు నోటీసులు.. నిర్మాత క్లారిటీ…
Advertisement

Yashoda : సమంత టైటిల్ పాత్రలో నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘యశోద’. హరి, హరీష్ దర్శక ద్వయం తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. సినిమా హిట్ టాక్ తెచ్చుకోవటంతో థియేటర్స్‌లో మంచి వసూళ్లనే రాబడుతోంది. సినిమాను త్వరలోనే ఓటీటీలోనూ విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

యశోద మూవీ సరోగసీ అనే పాయింట్ మీద తెరకెక్కింది. అందులో ఈవా అనే అనే సరోగసీ సెంటర్‌ను చూపించారు. ఈవా పేరుతో నిర్వహిస్తున్న ఓ ఆస్పత్రి యశోద సినిమాపై కోర్టు కేసు వేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై సినిమా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ స్పందించారు. యశోద సినిమాపై కోర్టు నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశారు. సినిమా ట్రైలర్ లోనూ ఈవా పేరుతో ఉన్న సెంటర్ ను చూపించామని తెలిపారు.

Advertisement

అసలు నిజంగా ఈవా పేరుతో ఓ ఐవీఎఫ్ సెంటర్ నడుస్తోందని తమకు తెలియదన్నారు నిర్మాత. సినిమా రిలీజ్ అయి రెండువారాలు దాటిన తర్వాత అభ్యంతరాలు రావడమేమిటని ప్రశ్నించారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ముందే తమ దృష్టికి తీసుకొస్తే తగిన వివరణ ఇచ్చేవారని యశోద చిత్ర నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. తాము ఏ ఆస్పత్రి ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయత్నించలేదని తేల్చిచెప్పారు. ఎలాంటి ఆటంకాలు లేకపోతే యశోద మూవీ డిసెంబర్ 19న ఓటీటీ ఆమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×