Big Stories

KCR : డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ..కేసీఆర్ వ్యూహం ఇదేనా?

KCR : తెలంగాణలో ఒకవైపు ఈడీ, ఐటీ దాడులు ప్రకంపనలు రేపుతున్నాయి. మంత్రులే టార్గెట్ గా ఈ సోదాలు జరగడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే సీబీఐ ఎంట్రీకి నో చెబుతూ ఆదేశాలిచ్చింది. అయితే గ్రానైట్ వ్యాపారులపై జరిగిన దాడుల్లో మంత్రి గంగుల కమలాకర్ ను టార్గెట్ చేసింది ఈడీ. ఆ తర్వాత క్యాసినో కేసులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు, పీఏను ప్రశ్నించింది. తాజాగా మంత్రి మల్లారెడ్డి టార్గెట్ గా జరిగిన ఐటీ రైడ్స్ తెలంగాణలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు రేపాయి. కక్ష సాధింపుతోనే కేంద్రం తమను టార్గెట్ చేసింది మల్లారెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఇంకా మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తారని తెలిపారు. దాడులు జరుగుతాయని సీఎం కేసీఆర్ ముందే చెప్పారని మల్లారెడ్డి వివరించారు. ఐటీ దాడులను ధైర్యంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు

- Advertisement -

అసెంబ్లీ సెషన్ అందుకేనా?
ఇలా ఒకవైపు మంత్రులు, టీఆర్ఎస్ నేతలపై ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్న సమయంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. వారం రోజులపాటు సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో కేంద్రంపై కేసీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోందని విమర్శించారు. కేంద్రం విధిస్తున్న ఆంక్షల వల్ల 2022 -23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.40వేల కోట్ల ఆదాయం తగ్గిందని తెలిపారు. ఈ విషయాలన్నీ అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావును, శాసన సభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డిని కేసీఆర్‌ ఆదేశించారు.

- Advertisement -

కేసీఆర్ వ్యూహం ఇదే
అసెంబ్లీ వేదికగా ఈడీ, ఐటీ దాడులపై కేసీఆర్ గళమొత్తేందుకు సిద్ధమయ్యారు. కేంద్రంపై కేసీఆర్ విరుచుకు పడటం ఖాయం. తెలంగాణ ఆదాయం ఎందుకు తగ్గిందో లెక్కలతోసహా సభలో వివరించేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే ఆర్థికమంత్రి హరీష్ రావును సమావేశాల ఏర్పాట్లపై ప్రత్యేకంగా ఆదేశించారు. కేంద్ర విధానాలతో రాష్ట్రానికి జరుగుతున్న నష్టం వివరాలను అసెంబ్లీ ద్వారా ప్రజలు ముందు ఉంచాలని కేసీఆర్ భావిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అడ్డుపడుతుందనే విషయాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లాలన్నదే గులాబీ బాస్ వ్యూహం. అందుకే అసెంబ్లీనే వేదికగా ఎంచుకున్నారు. ఐటీ, ఈడీ దాడులతో రాష్ట్ర రాజకీయాలు హీటెక్కిన ఈ సమయంలో ప్రజలు అసెంబ్లీ సమావేశాలను ఆసక్తిగా చూస్తారు. అందుకే ఇదే అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సరైన సమయం అని కేసీఆర్ భావించారు. కేంద్రానికి వ్యతిరేకంగా పలు తీర్మానాలు ఈ అసెంబ్లీ సెషన్ లో చేసే అవకాశం ఉంది.

కేసీఆర్ వ్యూహాన్ని అసెంబ్లీలో బీజేపీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి . కాషాయ పార్టీ సభ్యులు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్ కు సభలో మాట్లాడే అవకాశం దక్కుతుందా లేక గత సమావేశాల మాదిరిగానే వ్యూహాత్మకంగా బయటకు పంపిస్తారో చూడాలి మరి. మొత్తం మీద ఈ శీతాకాల అసెంబ్లీ సెషన్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేశారనేది ఉత్కంఠ రేపుతోంది. గులాబీ బాస్ అసెంబీ వేదికగా ఎలాంటి సంచలన ప్రకటనలు చేస్తారో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News