BigTV English

Dhee movie: ఢీ సినిమా.. దిల్ రాజు అంత మాట అన్నారా… మొహం మీదే చెప్పేసాడేంటీ?

Dhee movie: ఢీ సినిమా.. దిల్ రాజు అంత మాట అన్నారా… మొహం మీదే చెప్పేసాడేంటీ?

Dhee movie: సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు భాగమవుతూ ఎన్నో సరికొత్త ,విభిన్నమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ ప్రేక్షకులకు ఒక సరికొత్త వినోదాన్ని పంచుతున్నారు. అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రతి ఒక్క సినిమా కూడా అందరికీ నచ్చాలని రూల్ అయితే లేదు. ఒక సినిమా ఒక వ్యక్తికి నచ్చితే మరొక వ్యక్తికి నచ్చకపోవచ్చు ఇలా ఎవరి కారణాలు వాళ్లకు ఉంటాయి. కొన్నిసార్లు బాగాలేదని రిజెక్ట్ చేసిన సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.


ఇక ఒక సినిమాని ఎన్నో అంచనాలతో విడుదల చేస్తున్నప్పటికీ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకొని నష్టాలను తీసుకువస్తుంటాయి. తాజాగా మంచు విష్ణు(Manchu Vishnu) కూడా తన సినిమా ఢీ (Dhee)గురించి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మంచు విష్ణు కన్నప్ప సినిమా (Kannaappa)ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఢీ సినిమా గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఇక ఈ సినిమా కూడా ఇటీవల తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సాధారణంగా ఒక సినిమా విడుదలకు ముందు పోస్ట్ షో వేస్తూ కొంతమంది సినిమా సెలబ్రిటీలను ఆహ్వానించి వారికి ఆ సినిమాని చూపిస్తారు.

యావరేజ్ సినిమా ….


ఇలా సినిమా చూసిన తర్వాత వారి అభిప్రాయాలను తెలుసుకొని ఏదైనా మార్పులు ఉంటే ఆ మార్పులు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారు. మనం నటించిన సినిమా నాలుగు గోడల మధ్య కూర్చుని చూస్తే అది మనకు ఎలా ఉన్న నచ్చుతుందనీ విష్ణు తెలిపారు. ఇక ఢీ సినిమా విషయంలో జరిగిన సంఘటనను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా ఫస్ట్ షో 2006 నవంబర్ 23వ తేదీ ప్రసాద్ ల్యాబ్ లో వేశారు. తిరిగి ఈ సినిమా 2007 ఏప్రిల్ 13 వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిందని విష్ణు గుర్తు చేసుకున్నారు. ఈ గ్యాప్ లో ప్రసాద్ ల్యాబ్ లో ఓ 100 షోలు పూర్తి చేసుకొని ఉంటాయి.

ఢీ సీక్వెల్ చిత్రం…

ఇక మా సినిమా ఫస్ట్ షో వేసినప్పుడు దిల్ రాజు గారు సినిమా చూసి ఈ సినిమా యావరేజ్ గా ఉంది పెద్దగా ఆడదని, కష్టమే అంటూ చెప్పేశారు. ఇలాంటి టాక్ బయటకు రావడంతో ఈ సినిమాని కొనుగోలు చేయడానికి బయ్యర్లు కూడా ఎవరు ముందుకు రాలేదు. దీంతో చేసేదేమీ లేక చివరి నిమిషంలో నాన్న ఈ సినిమాని విడుదల చేశారు. కట్ చేస్తే ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందని విష్ణు తెలియజేశారు. ఈ సినిమా శ్రీను వైట్ల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి విష్ణుతో పాటు శ్రీనువైట్ల కెరియర్ కు కూడా ఎంతగానో ఉపయోగపడింది. ఈ సినిమా మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా ఢీ 2 కూడా చేయబోతున్నాం అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ ఈ ప్రాజెక్టు మాత్రం సెట్స్ పైకి రాలేదు. అయితే ఢీ సినిమాలో కీలక పాత్రలో నటించిన శ్రీహరి, జయప్రకాశ్ రెడ్డి వంటి వారు మరణించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వీరిద్దరి పాత్ర కూడా చాలా హైలెట్ గా నిలిచిందని చెప్పాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×