NTR Dammu Movie:తొట్టెంపూడి వేణు (Thottempudi Venu) అంటే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయాలు అక్కర్లేని పేరు.ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో కీ రోల్స్ పోషించారు. అలాగే హీరోగా పలు సినిమాలు కూడా చేశారు.అలా ‘స్వయంవరం’, ‘కళ్యాణ రాముడు’, ‘చిరునవ్వుతో’, ‘చెప్పవే చిరుగాలి’, ‘గోపి గోపిక గోదావరి’,’పెళ్ళాంతో పనేంటి’ వంటి ఎన్నో హిట్ సినిమాల్లో హీరోగా చేశారు.అలాగే ‘హనుమాన్ జంక్షన్’,’ఖుషి ఖుషీగా’ వంటి సినిమాల్లో కీ రోల్ కూడా పోషించారు. అయితే అలాంటి వేణు తొట్టెంపూడి కొద్ది రోజులు ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చి ఆ తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్లో వచ్చిన దమ్ము (Dammu) సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు.అయితే ఈ సినిమా గురించి కథ వినకుండా.. డైరెక్టర్ చెప్పిన మాట నమ్మి పూర్తిగా మోసపోయానని, దెబ్బకు సినీ కెరియర్ క్లోజ్ అయ్యింది అంటూ తొట్టెంపూడి వేణు ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
డైరెక్టర్ ను నమ్మి మోసపోయాను – వేణు తొట్టెంపూడి
అసలు విషయంలోకి వెళితే.. తాజాగా వేణు నటించిన ఓ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో యాంకర్ మాట్లాడుతూ.. జగపతిబాబు (Jagapathi Babu) ‘లెజెండ్’ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చి బౌన్స్ బ్యాక్ అయ్యారు. హీరోగా ఉన్న జగపతిబాబు ఆ తర్వాత లెజెండ్ మూవీ తో స్టార్ గా మారి హీరోలకు సరిసమానమైన పాత్రలతో ఇండస్ట్రీలో బాగా ఫేమస్ అయ్యారు. అలాంటిది మీరెందుకు ఇండస్ట్రీలో మళ్లీ రాణించడం లేదని తొట్టెంపూడి వేణుని అడిగారు..
యాంకర్ మాటలకు తొట్టెంపూడి వేణు మాట్లాడుతూ..”నేను దమ్ము సినిమా క్యారెక్టర్ ఏంటో తెలుసుకోకుండానే కేవలం బోయపాటి శ్రీను (Boyapati Srinu) చెప్పిన మాటల్ని నమ్మే ఈ సినిమాలో చేశాను. ‘షోలే’ సినిమాలో అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) పాత్ర ఎలా ఉంటుందో దమ్ము సినిమాలో మీ పాత్ర అలా ఉంటుందని బోయపాటి శీను చెప్పారు. దాంతో దమ్ము సినిమాని చేశాను. కానీ తీరా సినిమా విడుదలయ్యాక రిజల్ట్ ఎలా ఉందో చెప్పనక్కర్లేదు.
జీవితంలో ఇంకెప్పుడూ అలా చేయను ఎ వేణు తొట్టెంపూడి
దమ్ము సినిమా కంటే ముందు నాకు చాలా సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. కానీ రిజెక్ట్ చేశాను. ఇక మొహమాటానికి పోయి దమ్ము సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. కానీ అంత వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమా నాకు ఒక గుణపాఠం నేర్పింది. ఇంకెప్పుడు కూడా కథ వినకుండా సినిమాలో నటించడానికి ఒప్పుకోకూడదని అర్థం చేసుకున్నా.. నాకంటూ కొంతమంది ప్రత్యేక అభిమానులు ఉన్నారు.
వారి కోసం నేను ఇలాంటి సినిమాలు చేయాలి అనుకోవడం లేదు. మొహమాటానికి పోయి సినిమాలు చేస్తే రియాక్షన్ ఇలా ఉంటుంది అంటూ దమ్ము సినిమా గురించి వెబ్ సిరీస్ ప్రమోషనల్ ఈవెంట్లో ఈ విషయాన్ని చెప్పారు తొట్టెంపూడి వేణు.అలా మొహమాటానికి పోయి ఒప్పుకొని కథ వినకుండానే దమ్ము సినిమా చేసి మోసపోయానంటూ చెప్పుకోచ్చారు. ఇక జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR) హీరోగా నటించిన దమ్ము సినిమాలో తొట్టెంపూడి వేణు ఎన్టీఆర్ బావ పాత్రలో నటించారు.
also read:Mega Family: మెగా హీరోలకే ఎందుకిలా.. కష్టానికి ప్రతిఫలం లభించేనా?