గత రెండేళ్లుగా యుద్ధంతో అల్లాడుతున్న గాజా ప్రజలు.. తినడానికి తిండిలేక అవస్థలు పడుతున్నారు. నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మన దగ్గర రూ. 5 పలికే Parle-G బిస్కెట్ ప్యాకెట్ ధర అక్కడ ఏకంగా రూ. 2,300కు అమ్ముతున్నారు. తాజాగా పాలస్తీనియన్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించాడు. మహమ్మద్ జావాద్ చేసిన ఈ పోస్టు అక్కడి దుస్థితికి అద్దం పడుతుంది. ఈ వీడియోలో తన చిన్న కుమార్తె Parle-G బిస్కెట్లు పట్టుకుని కనిపిస్తోంది. ప్యాకెట్ కోసం తాను €24 (సుమారు రూ. 2,342) చెల్లించి కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు. “ఒకప్పుడు Parle-G ధర రూ. €1.5గా ఉండేది. కానీ, ఇప్పుడు ఆధర ఏకంగా €24 కంటే ఎక్కువగా పెరిగింది. అయినా, నా కూతురు ఇష్టపడిన ఈ బిస్కెట్ ప్యాకెట్ ను కొనకుండా ఉండలేకపోయాను” అని ఎక్స్ వేదికగా వివరించాడు.
After a long wait, I finally got Ravif her favorite biscuits today. Even though the price jumped from €1.5 to over €24, I just couldn’t deny Rafif her favorite treat. pic.twitter.com/O1dbfWHVTF
— Mohammed jawad 🇵🇸 (@Mo7ammed_jawad6) June 1, 2025
మనం ఫ్రీగా పంపితే, అక్కడ ఎక్కువ ధరలకు అమ్మకం!
జువాద్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు కాసేపట్లోనే వైరల్ అయ్యింది. అక్కడి ప్రజలకు సాయం చేయాలని చాలా మంది నెటిజన్లు ఈ పోస్టుకు Parle-G కంపెనీని ట్యాగ్ చేశారు. “భారత్ Parle-Gని పాలస్తీనియన్లకు సహాయంగా పంపింది. కానీ, ఎయిడ్ ట్రక్కులను హమాస్ స్వాధీనం చేసుకుంది. వారు ఆకలితో ఉన్న పాలస్తీనియన్లకు ఆహారం, మందులను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. రూ. 5 Parle-Gని రూ. 2,300కు అమ్ముతున్నారు. అమాయకుల దుస్థితిని ఆసరాగా చేసుకుని దోపిడీకి పాల్పడటం నిజంగా దారుణం” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.
అసలు విషయం చెప్పిన జావాద్
సదరు నెటిజన్ పోస్టు జావాద్ రిప్లై ఇచ్చాడు. అతడు చెప్పింది నూటికి నూరు శాతం నిజం అన్నాడు. “గాజా ప్రజలకు వచ్చే సహాయం న్యాయంగా పంపిణీ చేయబడిందని కొందరు భావిస్తున్నారు. కానీ, నిజం ఏంటంటే, ఈ ఫుడ్ ను దొంగిలించి మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇందుకోసం చాలా మంది ఏజెంట్లు, దొంగలను నియమించింది. గోధుమ పిండి కిలోకు $500కి అమ్ముతున్నారు. చక్కెరను కిలోగ్రాముకు దాదాపు $90కి అమ్ముతున్నారు. నిత్యవసరాలను బ్లాక్ చేసి ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. ప్రజలకు అందాల్సిన వస్తువులను కొంత మందిని అక్రమంగా క్యాష్ చేసుకుంటున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశాడు.
Some people think the aid that comes for the people of Gaza is distributed fairly. But the truth is that the occupation has recruited many agents and thieves to steal this aid and sell it on the market at sky-high prices. For example, flour is sold for around $500, and sugar is… https://t.co/LMyNnD8gfp
— Mohammed jawad 🇵🇸 (@Mo7ammed_jawad6) June 6, 2025
2023 నుంచి యుద్ధంతో దద్దరిల్లుతున్న గాజా
2023 నుంచి గాజా యుద్ధభూమిగా మారింది. ఇజ్రాయెల్ దాడులతో స్మశానాన్ని తలపిస్తోంది. ఈ ఏడాది మార్చిలో కాల్పుల విరమణకు బ్రేక్ పడినప్పటి నుంచి ఇజ్రాయెల్.. పాలస్తీనా ప్రాంతంలోకి నిత్యవసరాలను పంపకుండా పూర్తి నిలిపివేసింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలలో పోషకాహార లోపం ఏర్పడింది. దాదాపు 50,000 మంది పిల్లలలో, 5.8 శాతం మందికి తీవ్రమైన పోషకాహార లోపం ఉన్నట్లు నిర్ధారణ అయింది. గత నెలలో తినేందుకు తిండిలేక సుమారు 30 మంది చనిపోయినట్లు పాలస్తీనా అధికారులు ప్రకటించారు. ఎక్కువగా పిల్లలు, వృద్ధులు చిపోతున్నట్లు తెలిపారు.
Read Also: 180 మీటర్లకు బైక్ రైడ్ బుకింగ్, మహిళ చేసిన పనికి అందరూ షాక్!