Naga Vamshi : టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరు నాగవంశీ.. ఈయన సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ను నడిపిస్తున్నాడు. ఈ బ్యానర్ పై ఎన్నో వందల సినిమాలు రిలీజ్ అవ్వడం మాత్రమే కాదు. బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. ఈ బ్యానర్ పై తాజాగా మరో మూవీ రిలీజ్ కాబోతుంది. కామెడీ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్ స్క్వేర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేయగా, ఈ చిత్ర టీజర్‌ను రీసెంట్‌గా రిలీజ్ చేశారు.. ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఈ మూవీ టీమ్ తాజాగా ఓ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నిర్మాత నాగ వంశీ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డాకు మహారాజ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవ్వడంతో బాలయ్య ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అసలు నిర్మాత ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం..
జనాలను కన్ఫ్యుజ్ చేసిన నిర్మాత..
మ్యాడ్ స్క్వేర్ ప్రెస్ మీట్లో నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ.. మ్యాడ్ స్క్వేర్’ రిలీజ్ డేట్‌పై మరోసారి క్లారిటీ ఇచ్చారు. మార్చి 29న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే, మార్చి 28న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు తో పోటీపడతారా అని ప్రశ్న ఎదురైంది.. పవన్ కళ్యాణ్ మార్చి 28న వస్తున్నట్లు తనకు తెలియదని ఒకవేళ ఆ మూవీ కన్ఫామ్ అయితే మా మూవీని పోస్ట్ పోన్ చేస్తానని క్లారిటీ ఇచ్చాడు. హరిహర వీరమల్లు మూవీ మార్చి 28న రావడం లేదా.. అందుకే నాగవంశీ ఇలాంటి కామెంట్స్ చేశారా?.. అనే సందేహం అభిమానుల్లో నెలకొంది. మరి దీనిపై వీరమల్లు మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
డాకు మహారాజ్ పై షాకింగ్ కామెంట్స్..
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన బ్లాక్ బాస్టర్ అయిన సినిమాల్లో డాకు మహారాజ్ కూడా ఒకటి. ఈ మూవీ పై నాగావంశీ మాట్లాడుతూ షాకింగ్ విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. డాకు అనుకున్న హిట్ అయితే అవ్వలేదు. భారీ కలెక్షన్స్ రాలేదు. కానీ మూవీ పర్వాలేదనే టాక్ ను అందుకుందని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటివరకు డాకు మంచి రెస్పాన్స్ ను అందుకోలేదని అన్నారు. ఈ మూవీ కలెక్షన్స్ పై క్లారిటీ ఇచ్చారు.. ఈ వీడియో వైరల్ అవ్వడంతో నందమూరి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ బ్లాక్ బాస్టర్ అవ్వడంతో ఈ మూవీ హిట్ అవ్వలేదని చెప్పాడు. మొత్తానికి ఈ ప్రెస్ మీడియా వైరల్ అవ్వడంతో బాలయ్య ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇక మ్యాడ్ స్క్వేర్ మాత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని నిర్మాత ధీమా వ్యక్తం చేశారు. మరి ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.. గతంలో వచ్చిన మ్యాడ్ మూవీ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే..