OTT Movie : సైకోలు రకరకాలుగా ఉంటారు. ఎవడి పిచ్చి వాడికి ఆనందం అన్నట్టు, ఈ సైకోలు కూడా కొన్ని పిచ్చి పనులు చేస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో పిచ్చుకల్ని ఒక వ్యక్తి గొంతు కోసి చంపుతుంటాడు. అది పోలీస్ స్టేషన్ కి వెళ్లి పెద్ద కేసై కూర్చుంటుంది. ఆ వ్యక్తిని పట్టుకునే క్రమంలో మూవీ స్టోరీ రన్ అవుతుంది. స్టోరీ సింపుల్ గా ఉన్నా ,చాలా చక్కగా తీశారు దర్శకుడు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
రెండు ఓటిటిలలో
ఈ బెంగాలీ మూవీ పేరు ‘బయాద్’ (Byadh). 2022 లో వచ్చిన ఈ బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ కి అభిరూప్ ఘోష్ దర్శకత్వం వహించారు. రాజర్షి దాస్ భౌమిక్ రాసినకధ చోరై హత్యా రోహోష్య ఆధారంగా రూపొందించబడింది. దీనిని జియోలిన్ మీడియా ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మించారు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ Hoichoi, Amazon prime Video లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరో ఒక పోలీస్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తుంటాడు. ఇతనికి ఇంకా పెళ్లి కాకపోవడంతో, తల్లి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుంటుంది. మరోవైపు కమిషనర్ హీరోని ఒక స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. అక్కడ కాళీ చరణ్ ఇతనికి పై ఆఫీసర్ గా ఉంటాడు. అక్కడ వీళ్లకు ఒక విచిత్రమైన కేసు తగులుతుంది. ఆ ఊరిలో పిచ్చుకలను గొంతు కోసి ఒక వ్యక్తి చంపుతుంటాడు. ఒకటో రెండో చనిపోతే పర్లేదు గాని సుమారుగా వందల్లో వీటిని చంపుతుంటాడు. ఇది పై ఆఫీసర్ల దృష్టికి రావడంతో, వీటిని చంపుతున్న సైకోని పట్టుకోవాలని చెప్తారు. చనిపోయిన పిచ్చుకలకి పోస్టుమార్టం చేయాలని ఒక డాక్టర్ని రిక్వెస్ట్ చేస్తారు. అయితే ఆమె ఆమె వీటికి పోస్టుమార్టం చేస్తే అందరూ నన్ను చూసి నవ్వుకుంటారని అంటుంది. బిర్యానీ ఇప్పిస్తాను అనడంతో నవ్వుతూ పోస్టుమార్టం చేస్తానని ఒప్పుకుంటుంది. పోస్టుమార్టం చేస్తుంది గాని బిర్యానీ పెట్టించరు. హీరో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆ సైకో ఫుట్ ప్రింట్ లను కనిపెడతాడు. వీటి ద్వారా అతడు 50 సంవత్సరాల వ్యక్తి అని తెలుసుకుంటారు.
అలా ఆ వ్యక్తిని కొన్ని ఆధారాలతో ఒక అడవి ప్రాంతంలో పట్టుకుంటారు. తప్పించుకోవాలని ప్రయత్నించినా, హీరో అతన్ని చాకచక్యంగా పట్టుకుంటాడు. పిచ్చుకలను ఎందుకు చంపుతున్నావని అడిగితే పెద్ద స్టోరీ చెప్తాడు. చైనాలో పంటలు నాశనం చేస్తున్నాయని, ఒకప్పుడు అక్కడ ఉన్నవాళ్లంతా పిచ్చుకలను చంపేశారు. ఆ తర్వాత అక్కడ పంట ఎక్కువగా ఉత్పత్తి అయింది. మనదేశంలో కూడా పిచ్చుకలను చంపేస్తే, పంట ఉత్పత్తి బాగా పెరుగుతుందని చెప్తాడు. అతని మాటలు విని పోలీసులు షాక్ అవుతారు. చివరికి అతన్ని అరెస్టు చేస్తారా? మెంటల్ హాస్పిటల్ కి పంపిస్తారా? హీరోకి పెళ్లి అవుతుందా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ Hoichoi, Amazon prime Video లో స్ట్రీమింగ్ అవుతున్న ‘బయాద్’ (Byadh) అనే ఈ మూవీని చూడండి