E-Paper
Advertisement

OTT Movie : ఒకరు ప్రెగ్నెంట్ లేడీని, మరొకరు హోటల్ గదిలో, ఇంకొకరు అజ్ఞాతంగా ప్రేమిస్తే… ఏం లవ్ స్టోరీలురా నాయనా

OTT Movie : ఒకరు ప్రెగ్నెంట్ లేడీని, మరొకరు హోటల్ గదిలో, ఇంకొకరు అజ్ఞాతంగా ప్రేమిస్తే… ఏం లవ్ స్టోరీలురా నాయనా
Advertisement

OTT Movie : కొన్ని సినిమాలను చూస్తున్నప్పుడు వాటిలో మనల్ని మనం ఊహించుకుంటాం. అటువంటి స్టోరీలు మనసుకు హత్తుకుంటాయి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్టోరీ ఉంటుంది. వాటిలో కొన్నింటికి ముగింపు ఆనందకరంగా ఉంటే, మరి కొన్నింటికి విషాదకరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే మూవీ చాలా గొప్పగా ఉంటుంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…

జియో సినిమా (Jio cinema) లో

Advertisement

ఈ ఫీల్ గుడ్ మూవీ పేరు ‘ఇష్క్ ఎ నాదాన్’ (Ishq A Nadaan).  2023 లో విడుదలైన ఈ రొమాంటిక్ డ్రామా మూవీకి అవిషేక్ ఘోష్ తొలిసారిగా  దర్శకత్వం వహించారు. ఇందులో లారా దత్తా, నీనా గుప్తా, శ్రియా పిల్‌గాంకర్, మోహిత్ రైనా, కన్వల్‌జీత్ సింగ్, సుహైల్ నయ్యర్, మృణాల్ దత్ సమిష్టి తారాగణంతో నటించారు. ఇందులో మూడు స్టోరీలు రన్ అవుతూ ఉంటాయి. ఒక్కోటి ఒక్కో ఆణిముత్యంలా ఉంటుంది. ఈ మూవీ జియో సినిమా (Jio cinema) లో 14 జూలై 2023 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

ఆషితోష్ ఫైవ్ స్టార్ హోటల్లో రిసెప్షన్ గా ఉంటాడు. అతనికి బిందు అనే ఒక కూతురు ఉంటుంది. తన భార్య చనిపోవడంతో కూతుర్ని ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. అతని ఇంటి ఓనర్ ఇంటిని ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తాడు. ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటాడు ఆ ఇంటి ఓనర్. భార్యతో గడిపిన ఆ ఇంటిని ఖాళీ చేయడానికి ఆషితోష్శ్కి బాధగా ఉంటుంది. అయితే ఒకసారి హోటల్ కి మోనా అనే మహిళ వస్తుంది. ఆమె కొద్ది రోజుల్లోనే ఆషితోష్ కి మంచి ఫ్రెండ్ అవుతుంది. పెద్ద బిజినెస్ ఉమెన్ అయినప్పటికీ, అతనితో క్లోజ్ గా ఉంటుంది. అయితే ఆషితోష్ ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పాలనుకుంటాడు. ఇంతలోనే తను ఒక స్నేహితురాలిని ప్రేమిస్తున్నానని చెప్తుంది. అంటే ఈ మహిళ మరొక అమ్మాయి తో రిలేషన్ లో ఉంటుంది. వాళ్ల రిలేషన్ తెలిసి ఆషితోష్ షాక్ అవుతాడు. సమాజం ఏమనుకుంటుందో అని ఇలా హోటల్లో కలుస్తున్నామని చెప్తుంది. అప్పుడతను ఆమెకు మోటివేషన్ ఇస్తాడు. అప్పటినుంచి వాళ్ళిద్దరూ స్వతంత్రంగా బయట తిరగడం మొదలు పెడతారు. ఇలా ఈ స్టోరీ ముగుస్తుంది.

మరోవైపు సియా, అమెరికాలో రాఘవ అనే వ్యక్తితో బ్రేకప్ చెప్పి, ఇండియాకి వస్తుంది. ఇండియాలో పియూష్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. అలా వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. కొద్ది రోజులకి ఆమె ప్రెగ్నెంట్ గా ఉండడం చూసి షాక్ అవుతాడు పీయూష్. తన మాజీ బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పాకే ఈ విషయం తెలిసిందని చెప్తుంది సియా. అయినా సరే పీయూష్ ఆమెను ఇష్టపడుతూ ఉంటాడు. మాజీ బాయ్ ఫ్రెండ్ ఆమె దగ్గరికి వచ్చి, నీ జీవితం నీ ఇష్టం అంటూ ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్తాడు. వీళ్ళిద్దరికీ ఈగో ప్రాబ్లం వల్లే ఇదంతా జరుగుతుంది. అలా సియా, పీయూష్ తో కలిసి బతకాలనుకుంటుంది. ఈ స్టోరీ ఇలానే ముగుస్తుంది.

మరోవైపు చారులత అనే ఒక 60 సంవత్సరాల వయసు మహిళ భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటుంది. తను సరదా కోసం ఒక వెకేషన్ కి వస్తుంది. అక్కడ ఈమెకి పాత మిత్రుడు ఎదురుపడతాడు. వీళ్ళిద్దరూ ఒకరినొకరు కష్టాలను చెప్పుకుంటారు. చారులతకు ఎప్పటినుంచో ఒక వ్యక్తి ఆమె పుట్టినరోజుకు ఒక కవిత పంపిస్తూ ఉంటాడు. కొన్ని సంవత్సరాల క్రితం అతన్ని ఒక్కసారి చూసి ఉంటుంది చారులత. వీళ్ళిద్దరిని కలపాలని ఆమె ఫ్రెండ్ చారులతని తీసుకువెళ్తాడు. అయితే అతను చాలా కాలం క్రితమే చనిపోయి ఉంటాడు. చనిపోయే ముందు ఈ లెటర్లు తనకు పంపాలని కూతురికి చెప్పడంతో, ఆమె అలాగే చేస్తూ ఉంటుంది. ఈ విషయం తెలిసి చారులత చాలా బాధపడుతుంది. ఈ స్టోరీ కూడా ఇలానే ముగుస్తుంది. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీని చూసేయండి.

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×