BigTV English

NTR: దేవర సెకండ్ సింగిల్.. ఇంకా హైప్ పెంచిన నిర్మాత నాగవంశీ

NTR: దేవర సెకండ్ సింగిల్.. ఇంకా హైప్ పెంచిన నిర్మాత నాగవంశీ

NTR: ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ ఆలీఖాన్ విలన్ గా కనిపించబోతున్నాడు.


ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెల్సిందే. త్వరలోనే సెకండ్ సింగిల్ కు మేకర్స్ ముహూర్తం పెట్టనున్నారు. మొదటి నుంచి దేవర మీద అభిమానులు ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు.

ఇక దీనికితోడు.. దేవరకోసం పనిచేసిన వారు అందరూ ఎన్టీఆర్ నటన, డ్యాన్స్ గురించి చెప్తూ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బాస్టో మార్టిస్ సైతం ఈ సెకండ్ సింగిల్ గురించి చెప్పుకొచ్చాడు. పెద్ద పెద్ద స్టెప్స్ ఏం లేవు కానీ, చిన్న స్టెప్స్ తోనే ఎన్టీఆర్ అదరగొడతాడని, రొమాన్స్ మాత్రం పీక్స్ అని చెప్పుకొచ్చాడు.


ఇక ఇప్పుడు అదే విషయాన్నీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సైతం ఎన్టీఆర్ రొమాన్స్ గురించి పోస్ట్ చేసి మరింత హైప్ క్రియేట్ చేశాడు. అరవింద సమేత వీరరాఘవ సినిమాలోని స్టిల్స్ ను షేర్ చేసారూ.. ” తారక్ అన్నని ఇలా క్యూట్ చూసి 6 సంవత్సరాలు అయ్యింది కదా.. మళ్లీ ఆ క్యూట్ గా స్మైల్ చేస్తూ రొమాన్స్ చేయటం చూస్తారు ఈసారి… మనకి అదే సరిపోతుంది కదా” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఫ్యాన్స్ హుషారు అయిపోయారు. ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేయడం పక్కా అని ఫిక్స్ అయిపోయారు. మరి ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×