BigTV English

Average Student Nani: హీరోయిన్లను డామినేట్ చేద్దామనుకుంటే.. వాళ్లే నన్ను చేశారు: యావరేజ్ స్టూడెంట్ నాని

Average Student Nani: హీరోయిన్లను డామినేట్ చేద్దామనుకుంటే.. వాళ్లే నన్ను చేశారు: యావరేజ్ స్టూడెంట్ నాని

Average student nani Pre Release Event: ఆగస్టు 2న ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ మూవీ విడుదల కాబోతున్నది. మెరిసే మెరిసే సినిమాతో దర్శకుడిగా మంచి సక్సెస్ అందుకున్న పవన్ కొత్తూరి ఈసారి దర్శకుడితోపాటు హీరోగా తెరమీద కనిపించబోతున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రాన్ని పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా థియేటర్లలోకి రాబోతున్నది. ఈ సందర్భంగా మంగళవారం చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినిమాలో నటించిన నటీనటులతోపాటు పలువురు గెస్ట్‌లు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా పవన్ కుమార్ కొత్తూరి మాట్లాడుతూ.. ‘ఈ కథతో సుమారుగా రెండేళ్లు ప్రయాణం చేశాను. కథలో తల్లి అంటే ఝాన్సీ, తండ్రి అంటే రాజీవ్ కనకాలను అనుకున్నాను. లక్కీగా నాకు వాళ్లే దొరికారు.. కాలేజీ అంటే పలు రకాల క్యారెక్టర్లు కనిపిస్తాయి. కానీ, నాని పాత్రలో మాత్రం జెన్యూనిటీ కనిపిస్తది. కాలేజీ కుర్రాడంటే జాలీగా ఉంటాడని అంతా అనుకుంటుంటారు.. కానీ, ఇక్కడే అదే ఛాలెంజింగ్ ఫేజ్. పిల్లలు, వారి తల్లిదండ్రులు పడే బాధ, ఆవేదన.. ఇలా అన్నీ కూడా ఈ సినిమాలో చూపించాను. తండ్రికొడుకుల మధ్య ఉండే రిలేషన్‌ను చూపించా. అయితే, నేను సాహిబ, స్నేహలను డామినేట్ చేద్దామనుకుంటే.. కానీ, వాళ్లే నన్ను డామినేట్ చేసేశారు. ఈ సినిమా చేసిన తరువాత ఒక దర్శకుడిగా నాకు చాలా సంతోషం వేసింది. మీరందరూ ఈ సినిమాను చూసి సక్సెస్ చేయండి’ అంటూ పవన్ పేర్కొన్నారు.

Also Read: ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చిన రాజ్ తరుణ్.. లీగల్ గానే ముందుకెళ్తా


అనంతరం హీరోయిన్ సాహిబ బాసిన్ మాట్లాడారు. ‘ఈ సినిమా నాకు వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే టాలీవుడ్‌లో ఇదే నా ఫస్ట్ మూవీ. నన్ను నమ్మి నాకు ఇంతమంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్, హీరో పవన్ కు కృతజ్ఞతలు. కార్తీక్ మంచి మ్యూజిక్‌ను అందించారు’ అని ఆమె చెప్పారు.

ఆ తరువాత మరో హీరోయిన్ స్నేహ మాట్లాడుతూ.. ‘ఈ మూవీలో నాకు చాలా మంచి పాత్ర ఇచ్చారు. అందుకు డైరెక్టర్, ప్రొడ్యూసర్‌కు థ్యాంక్స్ చెబుతున్నా. ఆగస్టు 2న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను చూసి మాకు సపోర్ట్ చేస్తారని నేను భావిస్తున్నాను’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

‘ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. హీరో పవన్ కోసమే ఈ ఈవెంట్‌కు వచ్చా. అయితే, యావరేజ్ స్టూడెంట్ నాని ఎలా ఉన్నా కూడా.. ఆ నాని తల్లి కూడా ఇలానే ఉంటుంది. అయితే, ప్రతీ తల్లికి తన కొడుకు తప్పు చేయడనే నమ్ముతుంది. పవన్ నాకు ఫోన్‌లోనే ఈ సినిమా స్టోరీని చెప్పాడు. ఈ చిత్రానికి పవన్ సరైన టీమ్‌ను వెతికి మరీ పట్టుకున్నాడు. సినిమా చూసిన తరువాత నాని కథ గురించి, హీరో పవన్ గురించి మీ అందరికీ అర్థమవుతది’ అంటూ నటి ఝాన్సీ పేర్కొన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ బి కొడకండ్ల, ఎడిటర్ ఉద్ధవ్, కెమెరామెన్ సజీష్ రాజేంద్రన్ కూడా మాట్లాడారు. ఈ సినిమాలో పని చేసినందుకు తమకు సంతోషంగా ఉందన్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×