Natty Kumar About Manchu Family Issue: ఏ సహాయం లేకుండా, బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన మోహన్ బాబు.. తనకంటూ ఒక మార్క్‌ను క్రియేట్ చేసుకున్నారు. తన తర్వాత తన వారసులను ప్రేక్షకులకు పరిచయం చేశారు. మంచు ఫ్యామిలీ అంటే ఇండస్ట్రీలోనే కాదు.. ప్రేక్షకుల్లో కూడా మంచి పేరు ఉంది. అలాంటి ఫ్యామిలీలో ప్రస్తుతం జరుగుతున్న ఆస్తి వివాదాలు సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే ఇది ఆస్తుల వివాదం అయ్యిండదు అంటూ ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ (Natty Kumar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇండస్ట్రీ టైగర్
‘‘మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు చాలా దురదృష్టకరం. ఇది చిన్న దుమారమే తప్పా ఇంకేమీ కాదు. వచ్చే ఏడాది మోహన్ బాబు ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తిచేసుకుంటున్నారు. ఆయన ఇండస్ట్రీలోకి ఒక విలన్‌గా వచ్చారు. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. 2 నిమిషాలు సరిపోదు. ఈ 50 ఏళ్లలో సినీ పరిశ్రమను టైగర్‌గా, పులిగా శాసించారు. దాసరి నారాయణ రావు తర్వాత ఇండస్ట్రీలో మొహమాటం లేకుండా మాట్లాడేది ఎవరంటే మోహన్ బాబే. ఎవరు ఆపదలో ఉన్నా ఆదుకుంటారని ఆ కుటుంబానికి చాలా మంచి పేరు ఉంది. సాయం చేయడంలో అందరూ ముందుంటారు’’ అని మంచు ఫ్యామిలీ గురించి గర్వంగా చెప్పారు నట్టి కుమార్.
Also Read: భూమా మౌనిక వల్లే మంచు ఫ్యామిలీలో గొడవలు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన పనిమనిషి
ఆ స్థాయి లేదు
‘‘ఏదో ఒక దురదృష్టం వెంటాడిందో, నరఘోష పట్టిందో.. ఏదో జరిగింది కానీ ఇది ఆస్తుల వివాదం కాదు. ఇది కూడా అందరి కుటుంబాల్లో ఉండే చిన్న గొడవలాంటిదే. ఇదేమీ పెద్దది కాదు. ఈ సమస్యను మోహన్ బాబే పరిష్కరించుకోగలరు. ఇంకెవరో ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు చెప్పే వ్యక్తి ఎవరైనా ఉంటే అది దాసరి నారాయణ రావు. ఆయన చనిపోయారు. మోహన్ బాబుకు చెప్పే స్థాయి, ఆయన కుటుంబంలోని గొడవలను సెటిల్ చేసే స్థాయి ఎవ్వరికీ లేదు. ఈ విషయం నేను గర్వంగా చెప్తాను. మోహన్ బాబు సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న కార్యక్రమాన్ని ఇండస్ట్రీ వ్యక్తులు మాత్రమే కాదు కుటుంబం కూడా దగ్గర ఉండి జరిపించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను’’ అన్నారు నట్టి కుమార్.
చిన్న గొడవ
‘‘మీది పదిమందికి సాయం చేసి అండగా ఉండే కుటుంబం. మీ కుటుంబంలో ఇలాంటివి రాకూడదని, రాబోవని అనుకుంటున్నాను. సినీ పరిశ్రమలో, రాజకీయాల్లో క్రమశిక్షణ పరంగా మోహన్ బాబుకు ఉన్న పేరు పిల్లలు నిలబెట్టాలి. ఈ చిన్న వివాదాలను పక్కన పెట్టి మోహన్ బాబు 50 ఏళ్ల ఫంక్షన్ ఎంత గొప్పగా చేద్దామని ఆలోచించాలని నా రిక్వెస్ట్. ఆయన పిల్లలకు కూడా ఆయన నైజమే వచ్చింది. ఇది అన్నదమ్ముల మధ్య చిన్న గొడవ. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని మోహన్ బాబు, విష్ణు కూడా చెప్పారు. మనోజ్ కూడా పెద్ద మనసుతో తన తండ్రికి ఉన్న విలువలు గుర్తుపెట్టుకొని పెద్ద మనసులో ఈ గొడవను ఇక్కడితో క్లోజ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను’’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు నట్టి కుమార్.
మంచు ఫ్యామిలీలో గొడవలు దురదృష్టకరం: నట్టి కుమార్
మోహన్ బాబు ముక్కుసూటి మనిషి
ఇండస్ట్రీలో ఓ టైగర్
మంచు కుటుంబానికి చాలా మంచి పేరు ఉంది
ఏదో నరఘోష తగిలినట్లుంది
ఒక్క మోహన్ బాబుకి తప్ప మంచు ఫ్యామిలీ వివాదాన్ని ఎవరూ పరిష్కరించలేరు
– నట్టి కుమార్@themohanbabu @iVishnuManchu… pic.twitter.com/9KtaPHUyUO
— BIG TV Breaking News (@bigtvtelugu) December 10, 2024