Gopichand: మ్యాచో హీరో గోపీచంద్ గత కొంతకాలంగా పరాజయాల మధ్య నడుస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు మంచి కథతో ప్రేక్షకులు ముందుకు వచ్చినా.. ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించలేక పోతుంది. ఒకటి కాదు రెండు కాదు గత కొన్నేళ్లుగా గోపీచంద్ కు ఒక్క విజయం కూడా దక్కలేదు అని అంటే అతిశయోక్తి కాదు. కానీ, పట్టు వదలను విక్రమార్కుల్లా గోపీచంద్ సినిమాలు చేస్తూనే వస్తున్నాడు. స్టార్ డైరెక్టర్స్ తో చేసినా.. స్టార్ బ్యానర్స్ లో చేసినా గోపీచంద్ కు లక్కు మాత్రం కలిసి రావట్లేదు.
ఇక ఈ ఏడాది కూడా విశ్వం సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు గోపీచంద్. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ అయిన శ్రీనువైట్ల చాలా గ్యాప్ తర్వాత విశ్వం సినిమాతో రీ ఎంట్రీఇచ్చాడు. వీరిద్దరి కాంబో అనగానే ఈ సినిమా అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు.
Manchu Manoj: వరుసగా అధికారులను కలుస్తున్న మనోజ్, మౌనిక.. న్యాయం జరిగేనా..?
వెంకీ ట్రైన్ కామెడీ ట్రాక్ ఈ సినిమాలోఉందని చెప్పడంతో ఫాన్స్ అందరు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూశారు. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన విశ్వం సినిమా కూడా పరాజయాన్ని అందుకుంది. ఇక దీంతో సగానికి సగం మంది ప్రేక్షకులు గోపీచంద్ సక్సెస్ పై అసలు వదులుకున్నారు.
కానీ, ఈ హీరో మాత్రం ఆశలు వదులుకోకుండా ఇంకా ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాడు. అందులో భాగంగానే మరో ప్లాప్ డైరెక్టర్ తో గోపీచంద్ జతకట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రానా దగ్గుబాటి హీరోగా ఘాజీ సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి. ఇక ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ తో అంతరిక్షం అనే సినిమా తెరకెక్కించి పరాజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు సంకల్ప్ నుంచి ఒక సినిమా కూడా రాలేదు.
Manchu Mohan Babu: ‘పిల్లి కూడా పెద్ద పులై తిరగబడుతుంది’.. మరో సంచలన పోస్ట్ చేసిన మోహన్ బాబు
ఇక అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబోలో ఒక సినిమా పట్టాలెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయట. గోపీచంద్ కు సంకల్ప్ చెప్పిన కథ బాగా నచ్చిందని, త్వరలోనే ఈ ప్రాజెక్టు అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. గత రెండేళ్లుగా సంకల్ప్ ఈ కథపై కష్టపడుతున్నాడట.
ఇక ఈ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాత చిట్టూరి శ్రీనివాస్ నిర్మించబోతున్నారు. విశ్వం తరువాత తనకు మంచి హిట్ ఇచ్చిన జిల్ డైరెక్టర్ రాధాకృష్ణతో గోపీచంద్ ఒక సినిమా చేస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. అయితే అది కొన్ని కారణాలవల్ల నిలిచిపోయినట్లు తెలుస్తుంది. ఇక దీంతో చేసేదేమీ లేక గోపిచంద్, సంకల్ప్ రెడ్డికి ఓకే చెప్పాడట. త్వరలో ఈ సినిమా అధికారికంగా ప్రకటించనున్నారు. మరి ఒక ప్లాప్ డైరెక్టర్.. ఒక ప్లాప్ హీరో కలిసి ఎలాంటి సినిమాను అందిస్తారో చూడాలి.