Manchu Family Issue: ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో రేగిన చిచ్చు గురించే ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులంతా మాట్లాడుకుంటున్నారు. అసలు మంచు ఫ్యామిలీలో ఏమైంది? మోహన్ బాబుకు, మనోజ్‌కు మధ్య ఎందుకు గొడవలు మొదలయ్యాయి అనే విషయం ఆసక్తికరంగా మారింది. ముందుగా సోమవారం మనోజ్‌కు, మోహన్ బాబుకు మధ్య గొడవ జరిగిందని, అందులో మనోజ్‌పై దాడి చేయడంతో తనకు గాయాలు అయ్యాయనే విషయం బయటికొచ్చింది. దీనిపై మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకున్నా వెంటనే చేయకుండా మెల్లగా ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇప్పుడు ఆ ఇంట్లో పనిచేసే పనిమనిషి ద్వారా మరిన్ని విషయాలు బయటపడ్డాయి.
పెళ్లి వల్లే
మంచు మనోజ్ (Manchu Manoj)కు ఎన్నో ఏళ్ల క్రితమే పెళ్లయ్యింది. తన మొదటి భార్యతో విడాకులు తీసుకొని పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న భూమా మౌనికతో ప్రేమలో పడ్డాడు. భూమా మౌనిక (Bhuma Mounika)కు కూడా అప్పటికే వివాహం జరిగి ధైరవ్ రెడ్డి అనే బాబు కూడా ఉన్నాడు. మనోజ్, మౌనిక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు కూడా మంచు ఫ్యామిలీ తనకు అండగా నిలబడలేదు. పెళ్లికి కూడా ఎవరూ రాలేదు. మంచు లక్ష్మి మాత్రమే దగ్గరుండి వీరి పెళ్లి చేసింది. అలా భూమా మౌనికను మనోజ్ పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఈ ఫ్యామిలీలో గొడవలు మొదలయ్యాయని చాలామందికి తెలిసిన ఓపెన్ సీక్రెట్. తాజాగా పనిమనిషి కూడా అదే విషయాన్ని కన్ఫర్మ్ చేసింది.
Also Read: మంచు ఫ్యామిలీ ఆస్తి వివాదంలో కీలక మలుపు… మనోజ్, మౌనికలపై కేసు నమోదు..!
చేయి చేసుకున్నాడు
‘‘మోహన్ బాబు (Mohan Babu) అనుచరుల్లో ఒకరితో వ్యాపారం విషయంలో మనోజ్‌కు గొడవ మొదలయ్యింది. అదే క్రమంలో మనోజ్‌కు వెనక్కి తోశారు. ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకున్నారు. ఇదంతా శనివారం జరిగింది. తర్వాత రోజు మోహన్ బాబు, మనోజ్ మధ్య గొడవ మొదలయ్యింది. ఇందులో ఎవ్వరికీ ఎక్కువగా దెబ్బలు తగల్లేదు. అన్నదమ్ములకు, తండ్రీకొడుకులకు మధ్య కొన్ని పాత గొడవలు ఉన్నాయి. మౌనికకు ముందే బాబు ఉన్నాడు కాబట్టి తనను మనోజ్ పెళ్లి చేసుకోవడం వారికి మొదటి నుండి ఇష్టం లేదు. మంచు లక్ష్మి వచ్చి కూడా వారికి సర్ధిచెప్పడానికి ప్రయత్నించింది. తండ్రిపై మనోజ్ చేయి చేసుకున్నాడు’’ అంటూ గొడవ జరిగిన సందర్భాన్ని పనిమనిషి వివరించింది.
వీడియో వైరల్
మొత్తానికి మనోజ్, మౌనిక వివాహం మంచు ఫ్యామిలీలో పెద్ద చిచ్చే పెట్టేలా చేసింది. ఇంతకు ముందు కూడా విష్ణు, మనోజ్ మధ్య గొడవ జరిగిందని, తన ఫ్యామిలీ జోలికి రావద్దంటూ మనోజ్ వార్నింగ్ ఇచ్చాడంటూ ఒక వీడియో వైరల్ అయ్యింది. దీంతో మంచు ఫ్యామిలీలో ఏవో గొడవలు ఉన్నాయని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ వెంటనే ఆ వైరల్ అయిన వీడియో నిజం కాదంటూ విష్ణు క్లారిటీ ఇచ్చాడు. తాజాగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనోజ్, మౌనిక పెళ్లి జరిగినప్పటి నుండి ఈ కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయని, ఇప్పుడు ఆస్థి పంపకాల్లో కూడా వీరి పెళ్లే అడ్డొచ్చిందని స్పష్టంగా తెలుస్తోంది. మంచు విష్ణు కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి అమెరికా నుండి వచ్చాడు.