Telugu Movie : సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులుగా కొనసాగుతూనే మరోవైపు నిర్మాతలుగా మారి సరికొత్త సినిమాలను నిర్మిస్తూ ఉంటారు. అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్లు కూడా సినిమాల డిస్ట్రిబ్యూషన్ మాత్రమే కాకుండా నిర్మాతలుగా మారి సినిమాలు చేస్తున్న సంఘటనలను మనం చూస్తున్నాము.. అయితే కొన్నిసార్లు నిర్మాతలు వారు అనుకున్న సినిమా రావాలి అంటే డబ్బు ఖర్చు పెట్టడానికి వెనకాడరు అనే విషయం మనకు తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది కొత్త సినిమాలను చేయటానికి ముందుగానే నిర్మాతలకు బంపర్ ఆఫర్ ఇస్తూ ఉంటారు. ఇలా ఓ డిస్ట్రిబ్యూటర్ నిర్మాతకు ఇచ్చిన ఒక బంపర్ ఆఫర్ గురించి ఇప్పుడు ఒక వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.
బంపర్ ఆఫర్…
ఆయన ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ డిస్ట్రిబ్యూటర్ గా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. అటు నైజాం ఏరియా లోను ఇటు ఆంధ్రాలో కూడా పెద్ద ఎత్తున సినిమాలను విడుదల చేస్తూ పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. ఇక ఈయన పేరుకే డిస్ట్రిబ్యూటర్ గాని కొన్ని వేలకోట్లకు అధిపతి అని తెలుస్తుంది. ఇలా డిస్ట్రిబ్యూటర్ గా భారీ బడ్జెట్ సినిమాలను విడుదల చేస్తూ మంచి సక్సెస్ అందుకున్న ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ కు ఊహించని ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది.
బ్లాంక్ చెక్….
ఇలా డిస్ట్రిబ్యూటర్ ఇచ్చిన ఆఫర్ చూసిన ప్రొడ్యూసర్ ఒక్కసారిగా షాక్ లో ఉండిపోయారు. ప్రొడ్యూసర్ కు ఈయన ఏకంగా బ్లాంక్ చెక్ (Blank Cheque)ఇచ్చి నీకు నచ్చిన ఫిగర్ రాసుకొని తనకు ఒక సినిమా చేసి పెట్టాలి అంటూ ఆఫర్ ఇచ్చారట. అయితే ఆ సినిమా పాన్ ఇండియా సినిమా అనుకుంటే మనం పొరపాటు పడినట్లే. ఒక చిన్న సినిమా కోసమే నిర్మాతకు ఇలా బ్లాంక్ చెక్ ఇచ్చి ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎవరైనా వారికి నచ్చిన మొత్తంలో డబ్బు తీసుకోవడం అనేది సర్వసాధారణం కానీ ఈ ప్రొడ్యూసర్ గారు మాత్రం డిస్ట్రిబ్యూటర్ కే ఊహించని షాక్ ఇచ్చారని చెప్పాలి.
డిస్ట్రిబ్యూటర్ బ్లాంక్ చెక్ ఇవ్వడంతో ఫైర్ అయిన ప్రొడ్యూసర్ చాలా సింపుల్ గా ఆఫర్ రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. ఇలా ప్రొడ్యూసర్ ఆఫర్ రిజెక్ట్ చేయడంతో చేసేదేమీ లేక డిస్ట్రిబ్యూటర్ సైలెంట్ అయ్యారని తెలుస్తుంది. ఇక ఆయన చెప్పిన విధంగా సినిమా చేయటానికి అభ్యంతరం లేకపోయినా బ్లాంక్ చెక్ ఇచ్చి నచ్చిన ఫిగర్ రాసుకోమని చెప్పడంతో ఆ నిర్మాత మనోభావాలు దెబ్బ తినడంతోనే ఈ ఆఫర్ వదులుకున్నారని తెలుస్తోంది. అయితే ఈయన కూడా ఇండస్ట్రీలో చిన్నచితికా ప్రొడ్యూసర్ కాదండోయ్ … ఈయన కూడా భారీ బడ్జెట్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ విషయం గురించి ఇండస్ట్రీలో వార్తలు బయటకు రావడంతో ఆ డిస్ట్రిబ్యూటర్ ఎవరు ?ఆఫర్ రిజెక్ట్ చేసిన ప్రొడ్యూసర్ ఎవరనే విషయంపై చర్చలు మొదలయ్యాయి.