SKN – Lucky Baskhar.. దుల్కర్ సల్మాన్(Dulquar Salman) .. ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఈయన.. నాగ్ అశ్విన్ (Nag Ashwin)దర్శకత్వంలో కీర్తి సురేష్ (Keerthi Suresh)లీడ్రోల్ పోషిస్తూ.. దివంగత నటీమణి సావిత్రి(Savitri) జీవిత కథ ఆధారంగా వచ్చిన ‘మహానటి’ సినిమాలో జెమినీ గణేషన్(Jemini Ganeshan)పాత్ర పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో ‘సీతారామం’ సినిమా చేసి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా నేరుగా తెలుగులో చేసిన ఈ సినిమాతో తెలుగులో మార్కెట్ భారీగా ఏర్పడింది. మలయాళం హీరో అయినప్పటికీ తెలుగు హీరోగా పేరు దక్కించుకున్నారు దుల్కర్ సల్మాన్.
లక్కీ భాస్కర్ మూవీతో రూ.100 కోట్ల క్లబ్ లోకి
ఇక సీతారామం తీసుకొచ్చిన క్రేజ్ తో మళ్ళీ ఆయన ‘లక్కీ భాస్కర్’ అంటూ తెలుగులో మరో సినిమా చేశారు ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్లో చేరి సరికొత్త విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్స్ పై ‘బేబీ’ నిర్మాత ఎస్కేఎన్ (SKN) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే దుల్కర్ సల్మాన్ హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు దాదాపు రూ.110 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది..అదే సమయంలో విడుదలైన కిరణ్ అబ్బవరం(Kiran abbavaram) ‘క’ సినిమా కూడా రూ.50 కోట్ల వరకు వసూలు చేసింది. ముఖ్యంగా ఈ ఏడాది విడుదలైన బెస్ట్ చిత్రాలలో ఈ చిత్రం కూడా ఒకటిగా నిలిచింది.
స్టార్ హీరోల సినిమాలకే కలెక్షన్స్..
ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో బేబీ నిర్మాత ఎస్ కే ఎన్ ఈ సినిమా కలెక్షన్స్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. లక్కీ భాస్కర్ కి వచ్చిన రెస్పాన్స్ తో పోల్చుకుంటే కలెక్షన్స్ చాలా తక్కువ అని ఆయన తెలిపారు. లక్కీ భాస్కర్ సినిమా కంటెంట్ పొటెన్షియల్ కి సరిపోయే కలెక్షన్స్ రాలేదని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. గత కొంత కాలంలో థియేటర్స్ లో సినిమాలు చూసే ఆడియన్స్ కూడా బాగా తగ్గిపోతారు. ఈ కారణంగానే సినిమాకి ఊహించిన కలెక్షన్లు కూడా రావు. ఇండస్ట్రీలో చాలామందికి ఈ అభిప్రాయం ఉంది. మాక్సిమం స్టార్ హీరోల సినిమాలు మాత్రమే ఒక రెండు మూడు వారాలు థియేటర్లలో కొనసాగుతాయి.ఇక కొత్త హీరోల పరిస్థితి మాత్రం ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఓటీటీలోకి రావడానికి రెండు నెలల టైం కావాలి..
ముఖ్యంగా మీడియం రేంజ్ హీరోల సినిమాలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా.. కలెక్షన్లు రావడం లేదు. ఒక పది రోజులపాటు థియేటర్లకు ఆడియన్స్ వస్తున్నారు.. కానీ ఆ తర్వాత తగ్గిపోతున్నారు. అయితే వీకెండ్ వరకే ప్రభావితం చూపిస్తున్నాయి. ఇక ఆ తర్వాత థియేటర్లు ఖాళీ అవుతున్నాయి. అలా థియేటర్లోకి వచ్చిన 20 రోజుల్లోనే ఓటీటీలోకి వస్తున్నాయి. ఎలాంటి సినిమా అయినా సరే థియేటర్లలో విడుదలైన తర్వాత ఓటిటిలో విడుదల చేయడానికి మినిమం రెండు నెలల గ్యాప్ ఉంటే కలెక్షన్లు రాబట్టుకునే అవకాశం ఉంటుందని, తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఎస్ కే ఎన్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.