BigTV English
Advertisement

Pope Francis Israel : ఇది యుద్ధం కాదు కృూరత్వం.. ఇజ్రాయెల్‌ దాడులను ఖండించిన పోప్ ఫ్రాన్సిస్

Pope Francis Israel : ఇది యుద్ధం కాదు కృూరత్వం.. ఇజ్రాయెల్‌ దాడులను ఖండించిన పోప్ ఫ్రాన్సిస్

Pope Francis Israel | గాజాలో జరుగుతున్న మారణకాండను క్రైస్తవుల మత గురువు పోప్ ఫ్రాన్సిస్ ఖండించారు. చిన్నపిల్లలు, అమాయకులపై ఇజ్రాయెల్ బాంబులు వేయడం ఏ మాత్రం సమర్థనీయం కాదని ఇది యుద్ధం కాదు.. క‌ృూరత్వమని ఆయన వ్యాఖానించారు. శనివారం డిసెంబర్ 21, 2024న ఆయన వాటిన్ సిటీ కేంద్ర పరిపాలన విభాగంలోని రోమన్ కురియా లో ప్రసంగించారు.


క్రిస్మస్ సందర్భంగా రోమన్ కురియా ప్రసంగంలో ఆయన మాట్లాడుడూ.. “నిన్ని చిన్నపిల్లలపై బాంబులు వేసి చంపేశారు. అమాయకులను హత్య చేస్తున్నారు. ఇది యుద్ధం ఎలా అవుతుంది. ఇది క‌ృూరత్వం మాత్రమే. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇదంతా నా హృదయాన్ని కలచివేస్తోంది. ఇజ్రాయెల్ చర్యలు ఏమాత్రం సమర్థనీయం కాదు. వాటికన్ చర్చి ప్రతినిధిగా, జెరుసలెం క్రైస్తవ ప్రతినిధిగా కార్డినల్ పియర్ బటిస్టా పిజాబాల్లా గాజాను పర్యటించాలనుకున్నారు. కానీ ఇజ్రాయెల్ అక్కడ వైమానిక దాడులు చేస్తూనే ఉంది. ఈ కారణంగా ఆయనకు అనుమతి ఇవ్వలేదు. యూద దేశం ఒంటరిగా ఉంది అని ఎంతకాలం ఇజ్రాయెల్ అమాయకంగా నటిస్తుంది. ఇజ్రాయెల్ ద్వంద్వ నీతి సహనాన్ని మించిపోయింది.” అని పోప్ తన ప్రసంగాన్ని ఆరంభించారు.

ప్రపంచంలోని 140 కోట్ల మంది రోమన్ కేథలిక్ క్రైస్తవులకు పోప్ ఫ్రాన్సిస్ నాయకత్వం వహిస్తున్నారు. యుద్ధ సమయాల్లో ఆయన చాలా జాగ్రత్తగా వ్యాఖ్యలు చేస్తుంటారు. అయితే ఇటీవల ఆయన గాజాలో ఇజ్రాయెల్ మిలిటరీ చేస్తున్నది అరాచకం చెప్పారు. నవంబర్ లో ప్రచురితమైన ది పాంటిఫ్ అనే జర్నల్ లో ఆయన వ్యాఖ్యానిస్తూ.. గాజాలో జరుగుతున్నది మారణహోమం (జెనోసైడ్) అని చాలామంది నిపుణులు నమ్ముతున్నారని రాశారు. గాజాలో నివసించే క్రైస్తవులను పరామర్శించడానికి చర్చి ప్రతినిధి వెళ్లాలనుకుంటే ఇజ్రాయెల్ అనుమతులు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు.


Also Read: 2025 ప్రపంచంలో మృత్యు తాండవం.. సిరియా పతనమే పునాది.. బాబా వంగా జోస్యం

శనివారం పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రభుత్వం సత్వరంగా స్పందించింది. ఆయనదే ద్వంద్వ నీతిని ఎదురు సమాధానం చెప్పింది. పోప్ ఫ్రాన్సిస్ అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, జిహాదీ టెర్రరిజంపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని ఆయన గుర్తించడం లేదని తెలిపింది. అక్టోబర్ 7, 2023న జరిగిన పరిణామాలతో తాము మూడు దిశల్లో యుద్ధం చేయాల్సి వచ్చిందని. యూద దేశం ఇజ్రాయెల్, (Israel) దాన్ని ప్రజలను ప్రపంచం నుంచి వేరుచేసి మళ్లీ ఒంటరిగా చేయడం పోప్ ద్వంద్వ నీతికి నిదర్శనమని ఇజ్రాయెల్ మంత్రి అమిచాయ్ చిక్లీ ఘాటుగా విమర్శించారు.

అయితే పోప్ వ్యాఖ్యానించిన కాసేపు తరువాతే చర్చి ప్రతినిధికి గాజాలో పర్యటించేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. తాము క్రైస్తవ మతాన్ని గౌరవభావంతో చూస్తామని.. అయితే గాజాలోని క్రైస్తవులు ఆ ప్రదేశం నుంచి వెళ్లిపోవాలని.. కావాలంటే మరో దేశాల్లో వెళ్లేందుకు వారికి సహకరిస్తామని అమిచాయ్ చిక్లీ అన్నారు.

శుక్రవారం డిసెంబర్ 20, 2024న గాజాలోని రెండు ఆస్పత్రులు, ఒక స్కూల్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 8 మంది చిన్నపిల్లలు చనిపోయారు. అక్బోబర్ 7, 2023 నుంచి ఇప్పటివరకు గాజాలో చనిపోయిన పౌరుల సంఖ్య 45,000 పైగా ఉంది. ఈ యుద్ధంలో గాజాలోని అన్ని పౌర నివాసాలు ధ్వంసమయ్యాయి. హమాస్ మిలిటెంట్ల వేటలో ఇజ్రాయెల్ అమాయకులు, మహిళలు, చిన్నపిల్లలపై కనికరం లేకుండా దాడులు చేసింది.

ప్రపంచ దేశాలు ఎంత విమర్శించినా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి యోఆవ్ గల్లంత్ దాడులు ఆపలేదు. దీంతో వీరిద్దిరకీ నవంబర్ 21, 2024న అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.

Related News

Earthquake In Japan: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

Donald Trump: టారిఫ్ లను వ్యతిరేకించేవాళ్లంతా ‘మూర్ఖులు’.. అమెరికన్లకు 2 వేల డాలర్ల డివిడెండ్: డొనాల్డ్ ట్రంప్

Elon Musk: ఎలాన్ మస్క్‌కు లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీ.. ఇంత డబ్బుతో ఏం చేస్తున్నాడు?

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

Big Stories

×