BigTV English

Project K:- ప్రాజెక్ట్-కె పదేళ్ల క్రితం వచ్చిన ఓ హాలీవుడ్ సినిమా..నా?

Project K:- ప్రాజెక్ట్-కె పదేళ్ల క్రితం వచ్చిన ఓ హాలీవుడ్ సినిమా..నా?


Project K:- ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్-కె సినిమా… ఇండస్ట్రీ ఇప్పటి వరకు చూడనిది. ఇలాంటి సబ్జెక్ట్‌ను ఇండియన్ సినిమా టచ్ చేయలేదు. ఆ మాటకొస్తే… వరల్డ్ సినిమాలోనే ఫస్ట్ ఎవర్ మూవీ. ఇంత బిల్డప్ ఇచ్చింది సినిమా యూనిట్. ప్రభాస్ ఫ్యాన్సే కాదు.. మిగతా వాళ్లు కూడా ఈ హైప్‌ను నమ్మారు. కారణం.. డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ కుర్ర దర్శకుడి ప్రతిభను ఇది వరకే చూశారు ప్రేక్షకులు. మహానటి సినిమా టేకింగ్‌తోనే ఆ విషయం అర్థమైంది కూడా. పైగా ఈ సినిమాకు మెంటార్‌గా సింగీతం శ్రీనివాస్ కూడా ఉండడంతో… బజ్ ఒక రేంజ్‌లో పెరిగింది. సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే కూడా నటిస్తుండడంతో.. నేషనల్ వైడ్‌గా క్రేజ్ మరింత పెరిగింది.

తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న ఓ వార్త ఏంటంటే.. ఇదొక హాలీవుడ్ మూవీ ఇన్‌స్పిరేషన్ అని. ఎలీసియమ్ పేరుతో పదేళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ హాలీవుడ్ మూవీ కాన్సెప్ట్‌తో ప్రభాస్ ప్రాజెక్ట్-కె సినిమా వస్తోందని చెప్పుకుంటున్నారు.


ఇంతకీ ఏంటీ ఎలీసియమ్ మూవీ..?
ఈ భూమి పూర్తిగా పొల్యూట్ అయిపోవడంతో మనిషి అంతరిక్షంలో జీవిస్తుంటాడు. ఇందుకోసం భూమి వాతావరణానికి దూరంగా ఓ క్లోజ్డ్ చాంబర్ కట్టుకుంటారు. ఇందులో ఉండేదంతా రిచ్ పర్సన్సే. ఈ ప్రత్యేకమైన చాంబర్లో బతికే వాళ్లకు జబ్బులు అనేవే రావు. ఒకవేళ వచ్చినా సెకన్లలో తగ్గించే టెక్నాలజీ ఉంటుంది. అయితే, ఈ చాంబర్లలో పనిచేయడానికి భూమి నుంచి కొందరిని ఎత్తుకొస్తూ ఉంటారు. ఈ క్రమంలో భూమి మీద ఉండే వాళ్లకు, అంతరిక్షంలో ఓ స్పెషల్ ఛాంబర్‌లో ఉండే వారికి మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఒక విధంగా ఆదిత్య 369 సినిమాను తలపించేలా భవిష్యత్తులో జరగబోయే సినిమాగా ఈ ప్రాజెక్ట్-కె ఉండబోతోందని తెలుస్తోంది. అందుకే, సింగీతం శ్రీనివాస్‌ను కూడా ప్రాజెక్టులో భాగంగా కలుపుకున్నారని చెప్పుకుంటున్నారు. 

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×