BigTV English

Naresh-Pavitra:- 26న నరేష్-పవిత్ర లోకేష్ పెళ్లి

Naresh-Pavitra:- 26న నరేష్-పవిత్ర లోకేష్ పెళ్లి

Naresh Pavitra:- నరేష్-పవిత్ర లోకేష్ రిలేషన్ అఫీషియల్. కృష్ణ చనిపోయినప్పుడు అందరి కళ్లల్లో పడ్డారు. న్యూఇయర్ రోజు లిప్ కిస్ పెట్టుకున్నారు. ఆ తరువాత ఇద్దరూ కొంత మంది బంధువులు, పెళ్లి పెద్దల మధ్య ఏడు అడుగులూ వేశారు. పవిత్ర లోకేష్ పెళ్లి జరిగిపోయింది. ఇవన్నీ చూసి ఈ ఇద్దరి పెళ్లి అయిపోయిందని అనుకున్నారంతా. కాని, ఎంఎస్ రాజు డైరెక్ట్ చేస్తున్న సినిమా అని ఆ తరువాత అర్థమైంది.


ఇప్పుడు నరేష్-పవిత్ర లోకేష్ పెళ్లి అంటూ మరో డేట్ అనౌన్స్ చేశారు. మే 26వ తేదీన వీళ్లిద్దరి పెళ్లి జరగబోతోందంటూ అఫీషియల్‌గా ప్రకటించారు. కాకపోతే ఇది కూడా ఓ పబ్లిసిటీ స్టంట్ అని తరువాత అర్థమైంది. మళ్లీ పెళ్లి సినిమాను ఈనెల 26న విడుదల చేసేందుకు ఎంఎస్ రాజు రెడీ అయ్యారు.

మళ్లీ పెళ్లి సినిమా ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. నిజ జీవితంలో జరిగిన సంఘటనలను, మరీ ముఖ్యంగా మీడియా ముందు రచ్చరచ్చ జరిగిన కొన్ని సీన్స్‌ను తీసుకుని యాజ్ ఇట్ ఈజ్‌గా దించేశారు. దీంతో ఈ సినిమాపై భయంకరమైన బజ్ పెరిగింది. అంతకు ముందు లిప్ కిస్ సీన్లు, ఏడడుగులు వేసిన సీన్లు చూపించిన దాని కంటే.. ట్రైలర్‌కు ఎక్కువ క్రేజ్ వచ్చింది. దీంతో… ఎంఎస్ రాజు అనుకున్న టార్గెట్ రీచ్ అయినట్టుంది.


కాంట్రవర్సీతోనో, కంటెంట్‌తోనో సినిమాకు విపరీతమైన పబ్లిసిటీ రావాలి. అలా జరిగితేనే ప్రచారం కోసం ఎక్కువ ఖర్చు చేయనక్కర్లేదు. ఈ విషయంలో ఎంఎస్ రాజు సూపర్ సక్సెస్. ఈ సినిమాలో నరేష్ ఫస్ట్ వైఫ్‌గా వనితా విజయకుమార్ నటించారు. మళ్లీ పెళ్లి సినిమాకు నరేష్ కూడా ఒక ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. విజయకృష్ణ మూవీస్ బ్యానర్ పేరుతో ఈ సినిమాకు ఒక నిర్మాతగా ఎంట్రీ ఇచ్చాడు. సురేష్ బొబ్బిలి, అరుల్‌దేవ్ మ్యూజిక్ అందిస్తున్నారు. 

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×