E-Paper
Advertisement

Victory Venkatesh : పాన్ ఇండియా వైపు వెంకీ.. ఎవరూ ట్రై చేయని రూట్

Victory Venkatesh : పాన్ ఇండియా వైపు వెంకీ.. ఎవరూ ట్రై చేయని రూట్
Advertisement

Victory Venkatesh : ఏ దారిలో వెళ్తేనేం… పాన్ ఇండియా వైపు నడిస్తే చాలు. ప్రస్తుత హీరోలకు పాన్ ఇండియా సినిమాలు చేయడం కష్టం. ఊరికనే పది భాషల్లో విడుదల చేసినంత మాత్రాన సరిపోదు.. అది హిట్ అవ్వాలి. కనీసం దానిపై బజ్ క్రియేట్ కావాలి. పాన్ ఇండియా లెవెల్లో మాట్లాడుకోవాలి. కాంతారా, కేజీఎఫ్, కార్తికేయ గురించి అలాగే మాట్లాడుకున్నారు. పుష్పకు కూడా పాన్ ఇండియా ఇమేజ్ దానివల్లే వచ్చింది. ఇదే టెంపోలో కొందరు పాన్ ఇండియా పేరుతో ప్రయత్నించి చేతులు కాల్చుకున్నారు. కాని, విక్టరీ వెంకటేష్ మాత్రమే ఇలా చేతులు కాల్చుకోకుండా సరికొత్త రూట్‌లో వెళ్తున్నాడు.

Advertisement

ప్రస్తుతం ఏదైనా సినిమా పాన్ ఇండియా లెవెల్లో వెళ్లాలంటే రెండే దారులు. ఒకటి.. ఆ హీరోకి ఇండియా లెవెల్లో అప్పీల్ అయినా ఉండి ఉండాలి. రెండోది.. దర్శకుడికి అంత సత్తా ఉండాలి. రాజమౌళి, ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నారంటే.. పాన్ ఇండియా లెవెల్ ఇంట్రస్ట్ ఉంటుంది. సో, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజమౌళి గాని, ప్రశాంత్ నీల్ గానీ.. వెంకీని పెట్టి సినిమా తీసేంత సీన్ లేదు. కాకపోతే.. ఇవేం లేకుండానే పాన్ ఇండియా అప్పీల్ తెచ్చుకున్నాడు విక్టరీ వెంకటేష్. రామానాయుడు వెబ్ సిరీసే ఇందుకు కారణం. తెలుగు ప్రేక్షకులు తిట్టుకుని ఉండొచ్చు గానీ.. నార్త్ ఆడియన్స్ బాగానే ఆస్వాదించారు ఆ కంటెంట్‌ని. నిజానికి తెలుగు వాళ్లు కూడా అందులో ఏముందో చూస్తే పోలా అని చూసేశారు.. అది వేరే మ్యాటర్.

ఇక సల్మాన్ ఖాన్‌తో కలిసి కాటమరాయుడు రీమేక్ సినిమాలో నటించాడు వెంకటేష్. నిజానికి ఈ సినిమాలో వెంకీ రోల్ చూసి ఫ్యాన్స్ నిరుత్సాహ పడ్డారు. పోయి పోయి ఇలాంటి క్యారెక్టర్ చేశాడేంటా అని. అయినా సరే… ఈ సినిమా ఫ్లాప్ అయినా మన విక్టరీ వెంకటేష్‌కి పాన్ ఇండియా అప్పీల్ అయితే వచ్చేసింది. జాతీయ స్థాయిలో మన వెంకీ అంటే ఎవరో తెలిసొచ్చింది. సౌత్ ఆడియన్స్‌కు వెంకటేష్‌ను పరిచయం చేయక్కర్లేదు. రానా నాయుడు, సల్యాన్ ఖాన్ మూవీతో ఇప్పుడు హిందీ ప్రేక్షకులకు వెంకీ ఎవరో పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

Advertisement

సో, వెంకీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. హీరోగా ఛాన్సులు ఇస్తారో లేదో తెలీదు గానీ.. ఇప్పటికైతే రెండు మల్టీ నేషనల్ కంపెనీలు వెంకీని బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోవడానికి రెడీ అవుతున్నాయి. ఇక వేడిలో వేడి.. వెంకీ నటిస్తున్న సైంధవ్ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. రానా నాయుడు తెచ్చిన క్రేజ్‌ను ఈ సినిమా కోసం వాడుకోవాలనుకుంటున్నారు. మొత్తానికి దారి ఏదైతేనేం.. వెంకీ సాధించాడు అంతే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×