E-Paper
Advertisement

Puri Jagannadh:- నో సెటిల్‌మెంట్స్.. సినిమానే నా సమాధానం

Puri Jagannadh:- నో సెటిల్‌మెంట్స్.. సినిమానే నా సమాధానం
Advertisement

Puri Jagannadh:- పూరీ జగన్నాథ్ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. డబుల్ ఇస్మార్ట్ టైటిల్ అనౌన్స్ చేసి.. ఇది హిట్ సినిమాకు సీక్వెల్‌గా చెప్పకనే చెబుతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ హిట్ కాబట్టి.. ఇది డబుల్ హిట్ అవుతుందనే సిగ్నల్స్ పంపాడు. ఇదంతా ఎందుకయా అంటే… పూరీ జగన్నాథ్‌, ఛార్మీ కౌర్‌పై పెద్ద ఉద్యమమే చేస్తున్నారు ఎగ్జిబిటర్లు. వీళ్లకు సమాధానం చెప్పేందుకే అన్నట్టుగా ఈ టైటిల్ ఉంది. వీళ్లకే కాదు.. ఈ సినిమా కొనేందుకు బయ్యర్స్ ముందుకు రావాలన్నా కూడా ఇప్పుడో కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సి ఉంది. కొత్త కంటెంట్, కొత్త టైటిల్ నమ్ముకోవడం కంటే.. హిట్ కాంబినేషన్, హిట్ ఇచ్చిన టైటిల్ పెట్టుకోవడమే బెటర్ అనుకున్నాడు పూరీ జగన్నాథ్. అసలే.. తమకు సెటిల్ చేస్తామన్న అమౌంట్ ఆరునెలల్లో ఇస్తామని చెప్పి ఇప్పుడు మరో సినిమా అనౌన్స్ చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, పూరీ-ఛార్మీ మాత్రం సినిమాతో వచ్చే లాభాలతోనే నష్టాన్ని పూడ్చుకోవాలనుకుంటున్నారు. పైగా ఇది కాస్త బడ్జెట్ ఎక్కువగా ఉండే సినిమానే అంటున్నారు. హైయెస్ట్ టెక్నికల్ స్టాండర్డ్‌తో తీయబోతున్న సినిమా. వచ్చే మార్చి నెలతో రిజల్ట్ అటోఇటో రావడం ఖాయం. ఈ లోపు ఈ సినిమాపై బజ్ క్రియేట్ చేయాలి.

Advertisement

పూరీ జగన్నాథ్ సత్తా ఉన్న డైరెక్టరే. పడిన ప్రతీసారీ తానేంటో నిరూపించుకున్నాడు. తన కసిని అంతా సినిమాలో చూపించి, హిట్స్ కొట్టాడు. ఇప్పుడు సరిగ్గా అలాంటి సిచ్యుయేషన్‌లోనే ఉన్నాడు పూరీ జగన్నాథ్. గతంలో పోకిరి సినిమా పూరీకి లైఫ్ ఇచ్చింది. ఆ తరువాత కష్టాల్లో ఉన్న తనకు బిజినెస్‌మెన్ కొత్త లైఫ్ ఇచ్చింది. ఇలా లైఫ్ ఇచ్చిన రెండు సినిమాల్లోనూ హీరో మహేష్ బాబునే. ఇప్పుడు అదే సెంటిమెంట్ రిపీట్ అవుతోంది. ఒకసారి హిట్ ఇచ్చిన రామ్ పోతినేని.. మరోసారి హిట్ ఇచ్చి లైఫ్ ఇస్తాడనేది ఆ సెంటిమెంట్.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×