Big Stories

Lord Shiva :- తలకిందులుగా ఉన్న శివుడు…

- Advertisement -

Lord Shiva :- పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం దగ్గర ఉన్న యనమదుర్రు శివాలయం మిగిలిన వాటికి భిన్నంగా ఉంటుంది . అన్ని చోట్ల కనిపించే శివలింగం మాదిరిగా ఇక్కడ శివయ్య కనిపించడు. ఒక ప్రత్యేకమైన భంగిమలో దర్శనమిస్తుంటాడు. తలకిందులుగా ఉన్న శివలింగం కనిపిస్తుంది. అంతేకాదు తలకిందులుగా ఉన్న శివుడు తపస్సు చేస్తున్న ముద్రను గమనించవచ్చు.

- Advertisement -

శివుడి జటాఠూటం నేలకు తగులుతున్నట్టు స్పష్టంగా గోచరిస్తుంది. శీర్షాసనంలో తపో భంగిమ ఉన్న శివలింగం దేశంలో ఎక్కడా మరెక్కడా కనిపించదు. పార్వతి దేవి 3నెలల పిల్లాడిగా ఉన్న కుమారస్వామిని లాలిస్తున్న రూపంలో దర్శనమిస్తుంది. శివుడికి ఉన్న నామాల్లో శక్తీశ్వర నామం ఒకటి. యనముదుర్రుకి యమనాపురం అని పూర్వం పిలిచే వారు.

ఎక్కడ శివుడు వెలిసినా లింగ రూపంలోనే వెలుస్తాడు. కానీ ఇక్కడ మాత్రమే పూర్తి భిన్నంగా ప్రత్యేక భంగిమలో వెలిశారు. భీమవరానికి ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది . ఆలయానికి తూర్పు ద్వారం ఎదురుగా శక్తి గుండం ఉంది. మంచి నీటి సరస్సుగా నుంచి స్వామి వారికి అభిషేకం, ప్రసాదాల తయారీకి జలాన్ని వినియోగిస్తుంటారు. ఈ చెరువులో నీరు శక్తివంతమైందని నమ్మకం. కాశీలోని గంగ నదికి సంబంధించిన ఒక పాయ అంతర్వాహిన ద్వారా ఇందులోకి ప్రవహిస్తుందని నమ్మకం. జియోలజిస్టుల పరిశోధనల్లో కూడా ఈవిషయాన్ని గుర్తించారు. అందుకే ఈ చెరువులోని నీటిని గంగానదితో సమానంగా భావిస్తుంటారు.

ఈఆలయానికి క్షేత్రపాలకుడు కుమారస్వామి. ఆలయాన్ని దర్శించుకున్నవారికి యమగండాలు ఉండవని స్థానికుల విశ్వాసం. ఇక్కడున్న కుమారస్వామికి పూజిస్తే అవివాహితులకి కళ్యాణయోగం ప్రాప్తిస్తుందని విశ్వసిస్తుంటారు. బిడ్డలు లేని వారికి పార్వతీదేవి దయతో సంతానం యోగం కలుగుతుందని పూజారులు చెబుతున్నారు. యనమదుర్రు శివాలయం పంచారామాల కంటే పురాతనమైనవి. శివరాత్రి పండుగ రోజు ఇక్కడ ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. కార్తీక మాసంలో వేలాది భక్తుల ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు చేస్తుంటారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News