Big Stories

Dark Web: డార్క్ వెబ్ నుండి యూజర్లను కాపాడడానికి గూగుల్ ప్లాన్…

- Advertisement -

Dark Web: డార్క్ వెబ్ అనేది ఎంతోమంది ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టింది. ఇంకా పెడుతూనే ఉంది. ఇప్పటికీ కోట్లలో యూజర్ల సమాచారం డార్క్ వెబ్‌లో ఉంది అనేది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. దీని గురించి సగటు యూజర్‌కు ఏ మాత్రం అవగాహన లేకపోయినా డార్క్ వెబ్ అనేది పెద్ద వల లాంటిది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి వారి నుండి యూజర్లను కాపాడడం కోసం గూగుల్ ఒక కొత్త అప్డేట్‌తో ముందుకొచ్చింది. అదే డార్క్ వెబ్ మానిటరింగ్.

- Advertisement -

గూగుల్ అనేది అతిపెద్ద సెర్చ్ ఇంజెన్ మాత్రమే కాదు.. దీని ఆధ్వార్యంలో ఎన్నో అత్యవసరమైన యాప్స్ కూడా ఉన్నాయి. అందులో ఒకటి జీమెయిల్. ముఖ్యంగా డార్క్ వెబ్ క్రిమినల్స్ జీమెయిల్‌ను హ్యాక్ చేసి యూజర్ గురించి మొత్తం సమాచారాన్ని తమ అదుపులోకి తీసుకుంటారు. అందుకే గూగుల్ ఆధ్వర్యంలో ఉన్న కారణంగా జీమెయిల్ అనేది మరింత సేఫ్‌గా ఉండాలని, జీమెయిల్ యూజర్ల డేటా లీక్ అవ్వకుండా ఉండాలని గూగుల్.. తన డార్క్ వెబ్ మానిటరింగ్ ఫీచర్‌ను మరింత మెరుగ్గా అప్డేట్ చేసింది.

జీమెయిల్ యూజర్లు.. తమ జీమెయిల్ అడ్రస్ డార్క్ వెబ్‌లో ఉందేమో స్కాన్ చేసి తెలుసుకునే ఆప్షన్‌ను డార్క్ వెబ్ మానిటరింగ్ ఫీచర్ అందిస్తోంది. ఒకవేళ వారి సమాచారం డార్క్ వెబ్‌లో ఉందని వారికి తెలిస్తే.. దానికి తీసుకోవాల్సిన చర్యలను కూడా ఈ ఫీచర్ చెప్తుంది. ఇప్పటివంరకు కేవలం గూగుల్ వన్ యూజర్లకు మాత్రమే జీమెయిల్ స్కానింగ్ అనే ఫీచర్ అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ ఫీచర్ అందరికీ అందుబాటులో ఉండడం మంచిదని గూగుల్ భావిస్తోంది.

గూగుల్ సర్వీసెస్ అనేవి రోజూ జీమెయిల్ యూజర్లను దాదాపు 15 బిలియన్ అనసరమైన మెసెజ్‌ల నుండి కాపాడుతున్నాయని యాజమాన్యం చెప్తోంది. దాదాపు 99.9 స్పామ్‌ను గూగుల్ సర్వీసులే అడ్డుకుంటున్నాయని తెలిపింది. జీమెయిల్‌తో పాటు గూగుల్ డ్రైవ్‌లో కూడా కొత్త ఫీచర్లు యాడ్ చేసే ఆలోచనలో ఉంది గూగుల్. మొత్తంగా సెర్చ్ ఇంజన్లలో కూడా పెరుగుతున్న పోటీని తట్టుకోవడానికి గూగుల్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News