Puri Jagannath:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ (Puri Jagannath) దర్శకుడు మాత్రమే కాదు.. నిర్మాత, రచయిత కూడా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘బద్రి’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. 2006లో మహేష్ బాబు(Mahesh Babu) తో ‘పోకిరి’ సినిమా చేసి సంచలనం సృష్టించారు. ఇక తర్వాత 2009లో విడుదలైన ‘నేనింతే’ సినిమా సూపర్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. అంతేకాదు ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ కు ఉత్తమ మాటల రచయితగా నంది అవార్డు కూడా లభించింది. ముఖ్యంగా హీరోలు వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న సమయంలో ఆ హీరోలతో సినిమాలు చేసి, వారికి మంచి కెరియర్ ను అందించారు. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ తో బద్రి, మహేష్ బాబు తో పోకిరి ,రవితేజ (Raviteja)తో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి , నాగార్జున (Nagarjuna)తో శివమణి వంటి సినిమాలు చేసి మంచి విజయాన్ని అందించారు. ఎన్టీఆర్ (NTR)తో టెంపర్ సినిమా చేసి సక్సెస్ అందుకున్న పూరీ జగన్నాథ్.. రామ్ చరణ్ (Ram Charan) ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. చిరుత సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
మహేష్ కంటే మహేష్ అభిమానులే బెటర్..
ఇక గత డబుల్ ఇస్మార్ట్ శంకర్ , అంతకుముందు లైగర్ సినిమాలు చేసి భారీ డిజాస్టర్ ను చవిచూశారు. ఇక దీంతో పూరీ జగన్నాథ్ తో సినిమా చేయాలి అంటేనే హీరోలు వెనుకడుగు వేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో.. పూరీ జగన్నాథ్ పాత ఇంటర్వ్యూ వీడియో ఒకటి వైరల్ గా మారింది. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూరీ జగన్నాథ్.. మహేష్ బాబు కంటే మహేష్ బాబు అభిమానులే చాలా బెటర్ అంటూ కామెంట్లు చేసి ఆశ్చర్యపరిచారు. అసలు విషయంలోకి అయితే.. జనగణమన సినిమా ఎప్పుడు చేస్తారు? అని ప్రశ్నించగా.. “చేయాలి అని నాకు కూడా ఉంది” అంటూ తెలిపారు పూరీ జగన్నాథ్.
ఫ్లాప్ డైరెక్టర్స్ కి మహేష్ బాబు అవకాశం ఇవ్వరు..
మహేష్ బాబు తో ఈ సినిమా చేస్తున్నారా ? అని ప్రశ్నించగా.. పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ.. మహేష్, మహేష్ అని అంటూ ఉంటారు కదా.. ఇప్పుడు నేను నా మనసులో మాట చెబుతాను. నేను ఫ్లాపుల్లో ఉన్నా.. లేదా నేను తీసిన సినిమా ఫ్లాపైన రోజున కూడా.. మహేష్ బాబు ఫ్యాన్స్ నుంచి నాకు మెసేజ్లు వస్తాయి. అన్న జనగణమన సినిమా మహేష్ బాబు తో చెయ్ అన్న అని మెసేజ్ లు పెడతారు. గతంలో నేను మహేష్ బాబుతో పోకిరి ,బిజినెస్ మాన్ సినిమాలు చేశాను కదా..ఆ కారణంగానే మహేష్ అభిమానులకు నామీద మంచి అభిమానం ఉంది. ఆ కారణంగానే నేను ఫ్లాపుల్లో ఉన్నప్పుడు మహేష్ బాబుతో జనగణమన సినిమా చేసి సక్సెస్ కొట్టాలని వారు ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్లకు అర్థం కానిది ఏదంటే.. నేను హిట్స్ సినిమాలు చేసినప్పుడే మహేష్ నాతో సినిమా చేస్తాడు అని.. ఈ విషయం ఎన్నోసార్లు మహేష్ అభిమానులతో చెబుదాం అనుకున్నాను. మహేష్ కంటే మహేష్ అభిమానులకే నా మీద ఎక్కువ నమ్మకం ఉంది” అంటూ పూరీ జగన్నాథ్ మహేష్ బాబు గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.
జనగణమనపై క్లారిటీ..
ఆ తర్వాత యాంకర్ మాట్లాడుతూ.. మీరు ఏదైనా హిట్ కొట్టి మళ్ళీ మహేష్ బాబు దగ్గరికి వెళ్తే ఆయన ఆక్సెప్ట్ చేయచ్చేమో అని అడగ్గా.. నాకు ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా.. అంటూ తన ఆత్మాభిమానాన్ని చంపుకోలేనని చెప్పాడు. మొత్తానికైతే హిట్ డైరెక్టర్లకు మాత్రమే మహేష్ బాబు అవకాశాన్ని ఇస్తాడు అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు పూరీ జగన్నాథ్. ఇకపోతే పూరీ జగన్నాథ్ తాను అనుకున్న జనగణమన సినిమాను విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తో చేయబోతున్నట్లు సమాచారం. ఇందులో పూజా హెగ్డే (Pooja Hegde) ను హీరోయిన్గా కూడా పెట్టాలని నిర్ణయించుకున్నారట. ఇక దీనిపై కూడా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.