Bald Head: ప్రస్తుతం జుట్టు రాలే సమస్య చాలా మందిలో పెరిగింది. జుట్టు రాలడంతో పాటు తిరిగి పెరగకపోవడాన్ని అలోపేసియా అంటారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం అలోపేసియా అరేటా అనేది దీర్ఘకాలిక సమస్య. ఇది జుట్టు కుదుళ్లు , గోళ్లను ప్రభావితం చేస్తుంది. దీంతో తలపై బట్ట తల రావడం ప్రారంభమవుతుంది. మీరు కూడా జుట్టు రాలడం, బట్టతల వల్ల ఇబ్బంది పడుతుంటే అస్సలు భయపడకండి. ఎందుకంటే జుట్టు పెరుగుదలకు చాలా ప్రభావ వంతమైన 2 ఆయిల్స్ తో పాటు వాటిని ఎలా వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఆముదం:
ఆముదం జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే కొవ్వు ఆమ్లాలు జుట్టు వేగంగా పెరిగేలా చేస్తాయి. అంతే కాకుండా ఇవి కుదుళ్లలోకి సులభంగా చొచ్చుకుని పోయి రంధ్రాల లోపలికి చేరుకోవడం ద్వారా జుట్టుకు తగినంత పోషణ అందుతుంది.
2. రోజ్మేరీ ఆయిల్:
రోజ్మేరీ ఆయిల్ జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజుల్లో దీనిని చాలా హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ లో ఉపయోగిస్తున్నారు. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు తలపై రక్త ప్రసరణను పెంచడంలో ఉపయోగపడతాయి. అంతే కాకుండా జుట్టును బలోపేతం చేయడంలో సహాయపడతాయి.
బట్టతల కోసం బెస్ట్ ఆయిల్:
కావాల్సినవి:
ఆముదం నూనె- 2 టేబుల్ స్పూన్లు
రోజ్మేరీ ఆయిల్- 10 చుక్కలు
తయారీ విధానం:
ముందుగా పైన తెలిపిన మోతాదులో 2 టేబుల్ స్పూన్ల కాస్టర్ ఆయిల్ లో 10 చుక్కల రోజ్మేరీ ఆయిల్ కలపండి. తర్వాత ఈ నూనెను కొద్దిగా వేడి చేసి, మీ తలపై అప్లై చేయండి. జుట్టు రాలిన చోట ఎక్కవ శ్రద్ధ చూపుతూ మసాజ్ చేయండి. తలపై ఈ నూనెను 1-2 గంటలు అలాగే ఉంచండి. తలకు తగిన పోషణ కోసం రాత్రంతా అలాగే ఉంచినా కూడా మంచి ఫలితం ఉంటుంది.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు:
మెరుగైన ఫలితాల కోసం.. మీరు దీన్ని వారానికి 2-3 సార్లు అప్లై చేయవచ్చు. మీరు దీన్ని ఉపయోగించడం ప్రారంభించిన తర్వాత మధ్యలోనే ఆపకండి. ఎందుకంటే జుట్టు తిరిగి పెరగడానికి సమయం పడుతుంది. ఆముదం చాలా మందంగా ఉంటుంది కాబట్టి, ప్రతిసారి ఉపయోగించిన తర్వాత నూనెను తొలగించడానికి షాంపూతో జుట్టును వాష్ చేయండి. జుట్టు రాలడాన్ని తగ్గించడానికి కెమికల్స్ లేని హెయిర్ ఆయిల్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది గొప్ప ఎంపిక. కానీ ఈ నూనెను ఉపయోగిస్తున్నప్పుడు ఓపికపట్టండి. ఎందుకంటే రిజల్ట్ రావడానికి కొన్ని వారాలు లేదా నెలలు సమయం కూడా పడుతుంది.
ఈ ఆయిల్‌తో ప్రయోజనాలు:
జుట్టు రాలడం నుండి విముక్తి:
మీ జుట్టు ఎక్కువగా రాలుతుంటే మీరు ఈ నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల తలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. అంతే కాకుండా రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. దీనిలో ఉండే సహజ యాంటీసెప్టిక్ లక్షణాలు మీ జుట్టును బలంగా చేస్తాయి.
Also Read: ఈ స్క్రబ్ ఒక్క సారి వాడితే చాలు.. అమ్మాయిలే అసూయపడే అందం
చుండ్రు నుండి ఉపశమనం:
తలపై వచ్చే ఇన్ఫెక్షన్ చుండ్రుకు కారణమని నిరూపిస్తుంది. ఇది మన జుట్టుకు, చర్మానికి కూడా హాని కలిగిస్తుంది. దీన్ని ఎదుర్కోవడానికి మనం తయారు చేసుకున్న నూనెను వారానికి రెండుసార్లు జుట్టుకు రాయండి. ఇది జుట్టు యొక్క ఆకృతిని మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా చుండ్రును తొలగిస్తుంది.
జుట్టు పరిమాణం:
చాలా మందికి జుట్టు క్రమంగా రాలిపోవడం ప్రారంభమవుతుంది. జుట్టు మూలాలు బలహీనంగా మారడంతో జుట్టు పరిమాణం క్రమంగా తగ్గుతుంది. దీని కారణంగా చాలా మంది బట్టతల బాధితులుగా మారుతుంటారు. ఇలాంటి సమయంలో జుట్టు పల్చబడటం, సమస్యను నివారించడానికి ఈ నూనెను కొద్దిగా వేడి చేసి మసాజ్ చేయండి. దీనిలో ఉండే పొటాషియం, ఐరన్ , విటమిన్లు జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.