Doctor removes: హిల్స్ ఏరియాలో రకరకాల సమస్యలు అక్కడి ప్రజలను వెంటాడుతాయి. సరైన వైద్య సదుపాయాలు ఉండవు. రకరకాల జంతువులు సైతం అక్కడ దర్శనమిస్తాయి. కాకపోతే ఒక్కోసారి అవి ప్రాణాంతకరంగా మారుతాయి కూడా. అలాంటి జరిగింది ఓ బాలుడికి. ముక్కు నుంచి తోక లాంటి వార్మ్ కనిపించింది. అది చూసి డాక్టర్లు కంగుతిన్నారు.
అదెలా జరిగింది?
జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఎంఎంఏబీఎం అసోసియేటెడ్ హాస్పిటల్ మంగళవారం 10 ఏళ్ల బాలుడి ముక్కు రంధ్రాల నుంచి పాము లాంటి వార్మ్‌ను బయటకు తీశారు డాక్టర్లు. రాంబన్ జిల్లాలోని బనిహాల్ పట్టణానికి చెందిన బాలుడు ముక్కు రంధ్రం నుంచి తోక లాంటి బయటకు కనిపించింది.
భయపడిన బాలుడి తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి ఈఎన్‌టీ డాక్టర్ కిషన్ టెస్టులు చేశారు. బాలుడి ముక్కు లోపల పాము మాదిరిగా పెద్ద వార్మ్ ఉందని అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని బాలుడి పేరెంట్స్ చెప్పలేదు. ఈ కేసు గురించి ENT డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ అమీర్‌తో చర్చించారు.
ఆయన ఇచ్చిన సలహా మేరకు సక్షన్ ప్రక్రియ ద్వారా ముక్కు నుంచి 9 నుంచి 10 సెంటీమీటర్ల పొడవు గల పాము మాదిరిగా ఉండే వార్మ్‌ను బయటకు తీశారు. దీంతో ఆ బాలుడు ఇప్పుడు కులాసగా ఉన్నాడు. వెంటనే బాలుడ్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆ వార్మ్ ఏ జాతికి చెందినది తెలుసుకునేందుకు శాంపిల్ ను ఫోరెన్సిక్స్ ల్యాబ్‌కు పంపారు.
ALSO READ: లీటర్ పాటు రూ. 180, నెయ్యి కిలో రూ. 4000
ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్, బయటకు తీసిన వార్మ్ ను వైద్య పరికరంతో పట్టుకున్నారు. అది మెలికలు తిరుగుతూ ఉండటం వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఆ బాలుడు కొన్ని రోజులుగా బరువు తగ్గుతున్నట్లు గుర్తించారు. ఆకలి వేయడం లేదని చెబుతున్నాడని వివరించారు. అనూహ్యంగా అతని ముక్కు నుంచి ఏదో తోక లాంటిది బయటకు రావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురికావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు.
హిల్స్ ఏరియాలో చెరువు, సరస్సుల వద్ద జాగ్రత్తగా ఉండాలని కొందరు స్థానికులు చెబుతున్నారు. ఇక ఆసుపత్రి విషయానికొస్తే.. ఇప్పటివరకు జీఎంసీ అనంతనాగ్ ENT విభాగం రకరకాల సర్జరీలు చేసింది. 225 కంటే ఎక్కువ థైరాయిడ్ సర్జరీలు చేసింది. లోతైన మెడ కణితి తొలగింపు, టోటల్ లారింజెక్టమీ, ఫ్లాప్ రీకన్‌స్ట్రక్షన్, ఎండోస్కోపిక్ మాక్సిలెక్టోమీలు, పరోటిడ్ వంటి అరుదైన శస్త్రచికిత్సలను నిర్వహించింది.
గతంలో ఇలాంటి ఘటన
ఇంకాస్త వెనక్కి వెళ్తే.. గతేడాది ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటన వెలుగు చూసింది. వైద్యులు ఒక వ్యక్తి ముక్కు నుండి పెద్ద వార్మ్‌ను తొలగించారు.చాలా రోజులుగా ఆ వ్యక్తి ముక్కు నుంచి రక్తస్రావం అవుతోంది. దాంతో లోపల వింత కదలికలు అనిపించాయి. ఆ తర్వాత వైద్యుల వద్దకు వెళ్లాడు. ముక్కు లోపల వార్మ్ ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత దాన్ని బయటకు తీశారు. దీనికి సంబంధించి కొత్త విషయం బయటకు వచ్చింది. ఉత్తరాఖండ్‌లోని ఒక జలపాతంలో నీటిలో స్నానం చేశాడు. స్నానం చేసే వ్యక్తుల శరీర భాగాలకు జలగలు అంటుకోవడం సర్వ సాధారణం. ముక్కు లోపల జలగ కనిపించడం ఒక అరుదైన ఘటన అని చెప్పారు వైద్యులు.
ENT Dept at GMC #Anantnag removes a large snake-like worm from an adolescent boy’s nostril. Doctors applied suction after detecting the unusual case. The specimen will be sent for forensic analysis.#Anantnag #GMCAnantnag #MedicalBreakthrough #Healthcare
📷 Third Party pic.twitter.com/Z1KecdsTTx— Kashmir Scan (@KashmirScan) February 18, 2025