E-Paper
Advertisement

Pushpa 2 : థియేట్రికల్ రైట్స్ కు భారీ ధరలు కోట్ చేస్తున్న నిర్మాతలు… చేతులెత్తేస్తున్న బయ్యర్స్

Pushpa 2 : థియేట్రికల్ రైట్స్ కు భారీ ధరలు కోట్ చేస్తున్న నిర్మాతలు… చేతులెత్తేస్తున్న బయ్యర్స్
Advertisement

Pushpa 2 : దేశవ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులు ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటింగ్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’ (Pushpa 2). మరికొన్ని రోజుల్లో ‘పుష్ప 2’ రూలింగ్ మొదలు కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కు సంబంధించిన బిజినెస్ జోరందుకుంది. అయితే మేకర్స్ భారీ ధరలు కోట్ చేస్తున్నడంతో, బయ్యర్స్ చేతులెత్తేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతం  ‘పుష్ప 2′(Pushpa 2) థియేట్రికల్ రైట్స్ డీల్స్ నడుస్తుండగా, ఉత్తరాంధ్రలో దాదాపు 23 కోట్లకు సినిమాను కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ మూవీ రైట్స్ సొంతం చేసుకునే విషయంలో గాయత్రి సతీష్, బళ్ళారి సాయి మధ్య గట్టి పోటీ నెలకొనగా, మేకర్స్ చెప్పిన భారీ ధరలకు గాయత్రి సతీష్ చేతులెత్తేసినట్టుగా తెలుస్తోంది. దీంతో రూ.22.50 కోట్లకు ఉత్తరాంధ్ర ‘పుష్ప 2’ థియేట్రికల్ రైట్స్ ని బళ్ళారి సాయి దక్కించుకున్నారు. ‘పుష్ప 2’కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని మేకర్స్ ఈ సినిమా థియేట్రికల్ విషయంలో భారీ ధరలు చెబుతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర విషయంలో సినిమా ఇంతటి రికార్డు ధరకు అమ్ముడు కావడానికి కారణం అదే.

Advertisement

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో ఏ ఇతర సినిమాలకు కానటువంటి బిజినెస్ ‘పుష్ప 2′(Pushpa 2)కు జరుగుతోందని తెలుస్తోంది. అయితే గతంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురం’లో సినిమాకు ఒక్క ఉత్తరాంధ్రా లోనే రూ. 21 కోట్ల మేర ధర పలికింది. అప్పుడు అల్లు అర్జున్ ఇంకా పాన్ ఇండియా రేస్ లో అడుగు పెట్టలేదు. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఇండియా హీరోలలో టాప్ లో ఉన్న అల్లు అర్జున్ ‘పుష్ప 2’కి ఉత్తరాంధ్రలో రూ.23 కోట్ల ధర పలకడం అన్నది సాధారణ విషయమే అంటున్నారు సినీ విశ్లేషకులు.

మరోవైపు రాయలసీమలో ‘పుష్ప 2’ (Pushpa 2) రైట్స్ ను అభిషేక్ రెడ్డి 30 కోట్లకు కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను తూర్పు గోదావరిలో మైత్రి మూవీస్, గుంటూరులో యువి క్రియేషన్స్, కృష్ణా జిల్లాలో గీతా ఆర్ట్స్, నెల్లూరులో అంజలి పిక్చర్స్, నైజాంలో మైత్రి మూవీస్ వారు రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రైట్స్ పరిస్థితి ఇలా ఉంటే అటు నార్త్ లో రూ.200 కోట్లకు పైగా ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టుగా టాక్ నడుస్తోంది.

Advertisement

సినిమా రిలీజ్ కాకముందే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కొట్టేలా కనిపిస్తోంది ఈ డీల్స్ గురించిన వివరాలు చూస్తుంటే. అయితే సినిమాకు ఇంతటి భారీ రేట్లు చెప్పడం పట్ల పలువురు బయ్యర్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ‘పుష్ప’  నార్త్ లో బాగానే ఆడినప్పటికీ, సౌత్ లో చాలా వరకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ కాలేదు. ఇప్పుడేమో ‘పుష్ప 2’ మూవీని భారీ ధరలకు బయ్యర్స్ కి అంటగడుతున్నారు. మరి ఈసారైనా ‘పుష్ప 2’ తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అవుతుందా ? అనేది చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×