BigTV English

Pushpa 2: ఉత్తరాంధ్రలో భారీ ధర.. ఆంధ్ర, తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్ ఇదే..!

Pushpa 2: ఉత్తరాంధ్రలో భారీ ధర.. ఆంధ్ర, తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్ ఇదే..!

Pushpa 2.. అల్లు అర్జున్ (Allu Arjun)హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో పుష్ప(Pushpa ) సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విజయం సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా పుష్ప 2 (Pushpa 2) రాబోతోంది. డిసెంబర్ 6వ తేదీన భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్ బిజినెస్ లెక్కలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా పుష్ప -2 సినిమా ఉత్తరాంధ్రలో భారీ ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాలకు ఇటీవల కాలంలో ఏ ఇతర సినిమాలకు లేనటువంటి థియేట్రికల్ డీల్స్ పుష్ప 2 కి జరిగినట్లు సమాచారం. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే రూ.90 కోట్ల రేషియోలో అమ్మకాలు చేశారట.


ఉత్తరాంధ్రలో భారీ ధరకు అమ్ముడుపోయిన పుష్ప -2 థియేట్రికల్ రైట్స్..

అందులో భాగంగానే ఒక్క ఉత్తరాంధ్ర ఏరియాకు రూ .23 కోట్ల మేరా ధర పలికినట్లు సమాచారం. ఇదే ఏరియాలో అల్లు అర్జున్ సూపర్ హిట్ చిత్రం అలవైకుంఠపురంలో రూ.21 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. ఇక అలాగే కృష్ణా జిల్లాలో ఈ సినిమా రూ.12.30 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే రాయలసీమలో రూ.30 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయట. పుష్ప 2 కి ఉన్న క్రేజ్ తగ్గట్టుగానే బిజినెస్ జరుగుతోందని ట్రేడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా సోలోగా రిలీజ్ కావడం సినిమాకి పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు
మరి కొద్ది రోజుల్లో పుష్ప రూలింగ్ మొదలవుతుందని హిట్ టాక్ మాత్రమే కాదు బ్రేక్ ఈవెన్ సాధించడం గ్యారెంటీ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు ఇదిలా ఉండగా మరోవైపు ఈ సినిమా థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్స్ జాబితా..

కొన్ని ఏరియాలలో రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా థియేట్రికల్ హక్కులను దక్కించుకోగా.. మరికొన్ని ఏరియాలలో ఇతరులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.. ఆంధ్ర లోని మెయిన్ ఏరియా ఉత్తరాంధ్ర లో సాయి కొర్రపాటి పుష్ప -2 థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు. పశ్చిమగోదావరి ఎల్విఆర్ పిక్చర్స్, తూర్పుగోదావరి – మైత్రి మూవీస్ సొంతంగా రిలీజ్ చేయబోతోంది. అలాగే గుంటూరు యు వి క్రియేషన్స్ నిర్మాత వంశీ కొనుగోలు చేయగా, కృష్ణాజిల్లా గీత ఆర్ట్స్ -2 అధినేత బన్నీ వాసు దక్కించుకున్నారు. నెల్లూరులో మైత్రి రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్ అంజలి పిక్చర్స్ భాస్కర్ రెడ్డి సొంతం చేసుకున్నారు. అలాగే ఏపీలోని మరో కీలకమైన ఏరియా రాయలసీమ ఏరియాను అభిషేక్ రెడ్డి రూ.30 కోట్లకు థియేట్రికల్ హక్కులు కొనుగోలు చేసినట్లు సమాచారం.

తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్..

అలాగే తెలంగాణ , నైజాంలో మైత్రి మూవీస్ ద్వారా ఈ సినిమా విడుదల కాబోతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఇటీవల షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నట్లు బ్రహ్మాజీ ఒక వీడియోతో సహా వెల్లడించిన విషయం తెలిసిందే. అంతే కాదు ఇందులో పలువురు కీలక నటీనటులు కూడా భాగమైనట్లు సమాచారం. అటు నార్త్ లో కూడా రూ.200 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ సినిమా విడుదలకు ముందే టార్గెట్ రీచ్ అయ్యేలా కనిపిస్తోందంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×