BRS MLC on Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖను ఉద్దేశించి బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు తీవ్రస్థాయిలో దుర్భాషలాడడంపై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. అలాగే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై కూడా పరుష పదజాలం ఉపయోగించి కామెంట్స్ చేయడం పొలిటికల్ టాక్ ఆఫ్ ది టాపిక్ గా నిలిచింది. ఎమ్మేల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మేల్సీ తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు.
హుజూరాబాద్ ఎమ్మేల్యే పాడి కౌశిక్ రెడ్డి నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అక్కడి సీఐ విధులకు ఆటంకం కలిగించే రీతిలో కౌశిక్ రెడ్డి వ్యవహరించారన్న ఆరోపణలతో, నేరుగా సీఐ ఇచ్చిన ఫిర్యాదుతో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. గురువారం పోలీసులు ఈ కేసులో ఇప్పటికే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ సంధర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు హంగామా చేయగా వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ అరెస్ట్ పై మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి ఓ పిచ్చోడని, అసెంబ్లీకి వస్తే గొడవ చేస్తారని.. మెదడు లేకుండా ఏదో మాట్లాడతారని ఆగ్రహించారు. ఫామ్‌హౌస్‌లో ఉన్న కేటీఆర్ పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డిని పావుగా బీఆర్ఎస్ వాడుకుంటుందని కూడా మంత్రి విమర్శించారు. ఈ క్రమంలో మహబూబాబాద్ లో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తక్కెళ్లపల్లి బూతుపురాణం బహిరంగంగా సాగింది. మహిళా మంత్రి అనే గౌరవం కూడా లేకుండా తక్కెళ్లపల్లి తీవ్రస్థాయిలో కామెంట్స్ చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
కొండా సురేఖను ఉద్దేశించి తక్కెళ్లపల్లి మాట్లాడుతున్న తీరును చూసి, అక్కడి బీఆర్ఎస్ నాయకులే ఖంగు తిన్నారట. వారు ఆపే ప్రయత్నం చేసినా, నా తీరే ఇది.. ఏమి కాదు అంటూ తక్కెళ్లపల్లి మరింతగా రెచ్చిపోయారు. అలాగే కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు సాగుతున్న నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లక్ష్యంగా కూడా మళ్లీ దుర్భాషలాడడం విశేషం. పిచ్చికుక్క అంటూ సంభోధిస్తూ తక్కెళ్లపల్లి.. చిల్లర సర్కార్ అంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఒక మహిళా మంత్రిని ఉద్దేశించి తక్కెళ్లపల్లి అలా కామెంట్స్ చేయడంపై సోషల్ మీడియా వేదికగా తక్కెళ్లపల్లికి మహిళా నేతలు కౌంటర్ ఇస్తున్నారు. మీడియా ముఖంగా మాట్లాడే సమయంలో విచక్షణ కోల్పోయి తక్కెళ్లపల్లి మాట్లాడడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు బూతు పురాణం..
మంత్రి కొండా సురేఖపై అనుచిత వ్యాఖ్యలు
మహిళ అని కూడా చూడకుండా బండ బూతులు తిట్టిన తక్కెళ్లపల్లి
కనీస దిద్దుబాటు చర్య కూడా చేయకుండా మీడియా ముందే బూతులు మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ@BRSparty#BRS #MLCRavinderRao… pic.twitter.com/2M7ZCHSgFM
— BIG TV Breaking News (@bigtvtelugu) December 5, 2024