BigTV English

Pavani Karanam: ‘పుష్ప 2’లో పుష్ప రాజ్ అన్న కూతురిగా నటించింది ఎవరో తెలుసా?

Pavani Karanam: ‘పుష్ప 2’లో పుష్ప రాజ్ అన్న కూతురిగా నటించింది ఎవరో తెలుసా?

Pavani Karanam: ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఎక్కడ చూసినా ‘పుష్ప 2’ (Pushpa 2) గురించే హాట్ టాపిక్ నడుస్తోంది. ఇప్పటికే ప్రీమియర్స్ చూసిన చాలామంది ఆడియన్స్ సోషల్ మీడియా ద్వారా తమ రివ్యూలను అందిస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్ వల్ల ఈ సినిమాలో చిన్న చిన్న పాత్రలు కూడా ఆడియన్స్‌లో బాగా రెజిస్టర్ అవుతున్నాయి. అలా రెజిస్టర్ అయిన పాత్రల్లో ఒకటి పుష్ప అన్న కూతురి పాత్ర. ‘పుష్ప 2’లో పుష్ప రాజ్ అన్నగా అజయ్ నటించాడు. ఆ అజయ్ కూతురిగా నటించిన నటి తన యాక్టింగ్‌తో అందరినీ ఆకట్టుకుందని ఆడియన్స్ అంటున్నారు. ఇంతకీ ఆ నటి ఎవరో మీరు గుర్తుపట్టారా?


సమోసా తింటావా శిరీష?

చిన్న సినిమాల్లో కూడా కంటెంట్ ఉంటుంది అని నమ్మి చూసేవారికి ఒక డైలాగ్ బాగా గుర్తుండే ఉంటుంది. అదే.. ‘సమోసా తింటావా శిరీష?’. ఈ డైలాగ్ ఏ సినిమా అని చాలామందికి తెలియకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఒకప్పుడు ఈ డైలాగ్ తెగ వైరల్ అయ్యింది. ఆ సీన్‌లో, ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించింది మరెవరో కాదు.. పుష్ప అన్న కూతురు. తన అసలు పేరు.. పావని కరణం (Pavani Karanam). మంచిర్యాలలో పుట్టి పెరిగిన పావని.. వెండితెరపై నటి అవ్వాలనే ఆశతో హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో చేస్తూ కెరీర్‌ను ప్రారంభించి మొత్తానికి అనుకుంది సాధించింది. ఇప్పటికే తను హీరోయిన్‌గా పలు సినిమాలు కూడా విడుదలయ్యాయి.


Also Read: ‘ పుష్ప2 ‘కు భారీ షాక్.. రిలీజైన రోజే ఆన్‌లైన్‌లో HD ప్రింట్ లీక్..

కల నేరవేరుతుంది

టాలీవుడ్‌లో హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయిల సంఖ్య చాలా తక్కువ. అలాంటి తెలుగమ్మాయిల్లో పావని కూడా ఒకరు. కానీ ఇప్పటివరకు తను ఎన్ని సినిమాల్లో నటించినా రాని గుర్తింపు.. ‘పుష్ప 2’లో చేసిన క్యారెక్టర్‌తో వచ్చింది. సినిమాను మలుపు తిప్పే ప్రాముఖ్యత ఉన్న క్యారెక్టర్‌ను సుకుమార్ తనకు అందించారు. అలాంటి క్యారెక్టర్‌ను పావని కూడా బాగా హ్యాండిల్ చేసిందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఒక తెలుగమ్మాయిగా తాను పెద్ద కలను కన్నానని, ఆ కల వెండితెరపై నిజం కాబోతుండడం చూస్తున్నానని సంతోషం వ్యక్తం చేసింది పావని కరణం. దీనికంటే ముందు తను చేసిన సినిమాలు ఏంటని నెటిజన్లు ఇప్పుడు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.

హీరోయిన్‌గా సినిమాలు

ముందుగా అడవి శేష్ హీరోగా నటించిన ‘హిట్ 2’లో ఒక చిన్న పాత్రలో నటించింది పావని కరణం. అందులో శ్రద్ధా అనే ఫారెన్సిక్ ఆఫీసర్‌గా చాలా కాన్ఫిడెంట్‌గా నటించినా ఆ పాత్ర ప్రేక్షకుల్లో అంతగా రెజిస్టర్ అవ్వలేదు. అదే సమయంలో తిరువీర్ హీరోగా నటించిన ‘పరేషన్’ అనే విలేజ్ డ్రామాలో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ కొట్టేసింది పావని. ఇందులో శిరీష పాత్రలో తన నటనకు మంచి ప్రశంసలు అందాయి. ఈ మూవీని రానా ప్రజెంట్ చేయడంతో ఎక్కువమందికి రీచ్ అయ్యింది. ఆ తర్వాత ‘పైలం పిలగా’ అనే మూవీలో హీరోయిన్‌గా నటించింది. ఇక ‘పుష్ప 2’లో పాత్రతో తనకు మంచి గుర్తింపు రావడంతో మరెన్నో సినిమాల్లో తను కనిపిస్తుందని ఆడియన్స్ ఆశిస్తున్నారు.

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×