BigTV English
Advertisement

Pushpa 2 Movie Public Reation : పుష్ప 2 మూవీ పబ్లిక్ రియాక్షన్..

Pushpa 2 Movie Public Reation : పుష్ప 2 మూవీ పబ్లిక్ రియాక్షన్..

Pushpa 2 Movie Public Reation : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప 2 మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసారు. మొత్తానికి వాళ్ళ నిరీక్షణ ఈరోజుతో పూర్తి అయ్యింది. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ నుంచి వస్తున్న మాస్ యాక్షన్ సినిమాను చూసేందుకు అటు ఫ్యాన్స్, ఇటు సినీ అభిమానులు ఎంతో ఆశగా థియేటర్ల వద్దకు వెళ్లారు. పుష్ప 2 మేనియాతో దేశం ఊగిపోతోంది. ఆరు భాషల్లో దాదాపు 12 వేల స్క్రీన్‌లలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం చిన్నా, పెద్దా థియేటర్‌లలో పుష్ప 2ను రిలీజ్ చేస్తుండటం విశేషం. పుష్ప 2 సినిమా టికెట్ ధరల పెంపుకు.. బెనిఫిట్ , స్పెషల్ షోలకు కూడా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. టిక్కెట్ ధర ఎంతైనా ఒకే అంటూ జనాలు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. మొదటి షో పడింది. అసలు జనాలు రియాక్షన్ ఏంటి? సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందా? అసలు సినిమా ఎలా ఉంది అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం..


గతంలో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పుష్ప కు సీక్వెల్ గా పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యింది. భారీ అంచనాలతో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమా ఓపెనింగ్స్ బాగానే జరిగింది. ఇక ఇవాళ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో అని తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్, టీజర్స్, అలాగే రిలీజ్ అయిన మూడు పాటలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. యూట్యూబ్ లో కూడా భారీ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. సినిమా పై అంచనాలను రెట్టింపు చేశాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇవాళ రిలీజ్ సినిమాపై పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం..

పుష్ప 2 పై పబ్లిక్ ఎలా రియాక్ట్ అయ్యారంటే..? 


పుష్పరాజ్‌ పాత్రలో అల్లు అర్జున్‌ ఒదిగిపోయాడు. గతంలో కన్నా ఎక్కువగా ఫైర్ చూపించారు. బన్నీ చూపించిన మాస్‌ మామూలు మాస్‌ కాదు.. వైల్‌ మాస్‌ అన్నట్లు ఉంది. లుక్‌, మేకోవర్‌, మ్యానరిజం, యాస, ఎక్స్‌ప్రెషన్స్‌ ఇలా ప్రతి విషయంలో తన మార్క్‌ చూపించాడు బన్నీ. ఫైట్స్‌, డాన్స్‌ పైనా ప్రభావం చూపించాడు. జాతర ఎపిసోడ్‌, క్లైమాక్స్‌ సన్నివేశాల్లో బన్నీ యాక్టింగ్‌ మాటల్లో చెప్పలేం.. ఇక ఈ సినిమాలో ఐదుగురు విలన్స్ బన్నీ చుట్టు ఉన్నారు. షెకావత్‌ పాత్రలో ఫహాద్‌ ఫాజిల్‌ పర్ఫెక్ట్‌ ఫిట్‌. కానీ క్యారెక్టర్‌ రాయడంలో సుకుమార్ తేలిపోయినట్లు అనిపించిందని చెబుతున్నారు. ఆ క్యారెక్టర్‌ ముగింపు కన్వెన్‌సింగ్‌గా లేదు. రావు రమేష్‌ తప్ప సునీల్‌, అనసూయ తదితరుల పాత్రలు గతంలో లాగే ఏదో ఉండాలిగా అన్నట్లు ఉన్నాయి. ఇకపోతే జగపతిబాబు, తారక్‌ పొన్నప్ప భయం కలిగిస్తారు. అజయ్‌ పరిధి మేరకు బాగా చేశాడు. సాంకేతికంగా సినిమా ఎక్కడా తగ్గలేదు. ప్రతి డిపార్ట్‌మెంట్‌ తమ ప్రతిభను చూపించారు. దేవిశ్రీప్రసాద్‌ పాటలు, ఆర్‌ఆర్‌తో కట్టిపడేశారు. బన్నీ, సుకుమార్‌ అంటే తనకు ఎంత అభిమానమో మరోసారి చూపించాడు.. అన్ని బాగానే మ్యానేజ్ చేశారు కానీ పుష్ప రాజ్ మ్యానరిజం కనిపించలేదు. ఎప్పుడు చూసే అల్లు అర్జున్ కనిపించాడని కొందరు అంటున్నారు. అంతేకాదు.. ఈ మూవీకి ఇదే పెద్ద మైనస్ అని జనాలు అంటున్నారు. ప్రీమియర్ షోలను చూసిన ఫ్యాన్స్ కూడా ఇదే రియాక్షన్ ఇచ్చారు. ఇక ఇవాళ సాయంత్రం వరకు ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.. మొదటి రోజు ముందుగా అనుకున్న విధంగా 300 కోట్లు రాబట్టిందా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×