BigTV English

Pushpa2 : ‘పుష్ప2’ కు భారీ షాక్.. రెండో రోజుకే సగానికి పడిపోయిన బుకింగ్స్.. సుక్కు ఇంత మోసం చేశావా..?

Pushpa2 : ‘పుష్ప2’ కు భారీ షాక్.. రెండో రోజుకే సగానికి పడిపోయిన బుకింగ్స్.. సుక్కు ఇంత మోసం చేశావా..?

Pushpa2 : గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా పుష్ప పేరు తెగ వినిపిస్తుంది.. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్‌లు జంటగా నటించిన పుష్ప 2 ది రూల్‌పై ఆల్ ఇండియా లెవల్‌లో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అక్కడా, ఇక్కడ అని తేడా లేకుండా అన్ని ఏరియాల్లో బాగానే ప్రమోషన్స్ చేశారు. డిసెంబర్ 5 న థియేటర్లలోకి వచ్చింది.. పాన్ ఇండియా స్థాయిలో ఆరు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజైన పుష్ప 2 కలెక్షన్స్ గురించే అంతా చర్చించుకుంటున్నారు. మరి పుష్ప 2 ది రూల్ మొదటి రోజు కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసేలా కలెక్షన్స్ రాబట్టింది. సినిమా మొదటి రోజు పాజిటివ్ టాక్ ను అందుకోవడంతో రెండో రోజు అంతకు మించి ఉంటుందని అందరు అంచనా వేశారు. కానీ పుష్ప రాజ్ కు షాక్ ఇచ్చేలా కలెక్షన్స్ ఉన్నాయని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. మొదటి రోజు భారీగా ఓపెనింగ్ జరిగాయి. మరి రెండో రోజు ఎందుకు తగ్గాయి అనే అనుమానాలు రావడం సహజమే.. అందుకు కారణాలు గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


రెండు రోజు తగ్గిన బుకింగ్స్.. కారణమేంటంటే..? 

అల్లు అర్జున్ సినిమాలకు ఇండస్ట్రీలో కొన్ని అంచనాలు ఉంటాయి. గతంలో వచ్చిన పుష్ప మూవీ ఆ అంచనాలను రెట్టింపు చేసింది. ఆ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేశారు. మంచి రెస్పాన్స్ రావడంతో సూపర్ హిట్ టాక్ ను అందుకుంది. ఇక మూడేళ్ల తర్వాత ఈ మూవీకి సీక్వెల్ గా పుష్ప 2 మూవీ వచ్చింది. భారీ బడ్జెట్ తో పాటుగా భారీ అంచనాల నడుమ మూవీ డిసెంబర్ 5 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. నిన్న ఈ మూవీకి మొదటి షోతోనే మంచి టాక్ ను అందుకుంది.. అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఇక కలెక్షన్స్ కూడా 250 కోట్లవరకు మొదటి రోజు వసూల్ చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది. ఇక రెండో రోజు మాత్రం నిరాశను మిగిల్చింది. రెండో రోజు ఓపెనింగ్స్ బాగా తగ్గిపోయాయని ఓ వార్త ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఇది ఫ్యాన్స్ కు చేదుగా అనిపించినా నిజం అని చెబుతున్నారు. అందుకు కారణం సుక్కునే అని అంటున్నారు.


అదేంటీ కలెక్షన్స్ కోసం సుక్కు చాలా కష్టపడ్డాడు కదా అనుకోవచ్చు. ఆయన డైరెక్షన్స్ బాగానే చేసాడు. మూడు గంటలకు పై సినిమా ఉంటుంది. కానీ ట్రైలర్, టీజర్ లో భారీ హైప్ ను పెంచిన కొన్ని సీన్లను సినిమాలో లేపేశారనే టాక్.. మేజర్ సీన్స్ లేపేశారని, దానివల్లే రెండో రోజు బుకింగ్స్ దారుణంగా పడిపోయాయని తెలుస్తుంది.. ఇక మూడో రోజు కలెక్షన్స్ పెరుగుతాయేమో చూడాలి. ఎన్ని అడ్డంకులు వచ్చిన సినిమా టాక్ మారలేదని తెలుస్తుంది. మరి ఆ సీన్స్ ను సినిమాలో యాడ్ చేస్తారా? లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. ఇక ఈరోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో తెలియాలంటే సాయంత్రం వరకు వెయిట్ చెయ్యాల్సిందే. ఈ మూవీ 1000 కోట్లా టార్గెట్ తో రిలీజ్ అయ్యింది. మరి అంత రాబడుతుందా? అంతకు మించి వసూల్ చేస్తుందా? చూడాలి..

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×