BigTV English

California Earthquake: అమెరికా క్యాలిఫోర్నియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

California Earthquake: అమెరికా క్యాలిఫోర్నియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

California Earthquake| అమెరికాలోని క్యాలిఫోర్నియా రాష్ట్రంలో గురువారం భారీ భూకంపం వచ్చింది. ఉత్తర క్యాలిఫోర్నియాలోని తీర ప్రాంతాల్లో వచ్చిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 7.0 మ్యాగ్నిట్యూడ్‌గా రికార్డ్ అయింది. భూకంపం ప్రభావంతో తీర ప్రాంతాల్లోని పట్టణాల ప్రజల భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలందరూ ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు వాతావరణ విభాగం సునామీ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు కూడా జారీ చేసింది.


ఇప్పటివరకు అందిన వార్తల ప్రకారం.. ఎటువంటి ప్రాణనష్టం జరుగలేదు. అయితే అన్ని ప్రభావిత ప్రాంతాలను సమీక్షించిన తరువాత అధికారికంగా ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.

అమెరికా జాతీయ వాతావరణ విభాగం (నేషనల్ వెదర్ సర్వీస్) ప్రకారం.. క్యాలిఫోర్నియా, ఒరిగాన్ తీర ప్రాంతాల్లో సుమారు 800 కిలోమీటర్ల దూరం వరకు సునామీ వచ్చే ప్రమాదం ఉంది. గురువారం ఉదయం 10.44 గంటలకు భారీ భూకంపం తీర ప్రాంతాలను తాకింది. అయితే భూమి కంపించిన 90 నిమిషాల తరువాత వాతావరణ విభాగం సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకుంది.


Also Read: ఫ్రాన్స్‌లో 3 నెలలకే కూలిపోయిన ప్రభుత్వం.. ప్రధాన మంత్రిగా బార్నియర్ తొలగింపు!

భకంపం ముందుగా క్యాలిఫోర్నియా తీర ప్రాంతంలోని ఫర్నడేల్ పట్టణానికి 63 కిలోమిటర్లు పశ్చిమ దిక్కు వైపు వచ్చింది. ఈ ప్రాంతంలో జనాభా తక్కువ కావడంతో అక్కడ పెద్దగా ఆస్తి నష్టం జరుగలేదని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ఫర్నడేల్ పట్టణంలో కేవలం 1400 మంది జనాభా నివసిస్తున్నారని సమాచారం.

“ఇది చాలా పెద్ద భూకంపం. భూమి ఒక్కసారిగా కదలడంతో ఇక్కడి ప్రజలందరూ వేగంగా ఇళ్లు ఖాళీ చేసి రోడ్డుపైకి వచ్చారు. నా హార్డ్‌వేర్ స్టోర్ లోని లుంబర్ల, పెయింట్ క్యాన్లన్నీ షాపు చెల్లాచెదురుగా కింద పడిపోయాయి” అని ఫర్నడేల్ ఫైర్ డిపార్ట్‌మెంట్ లో వలంటీర్‌గా పనిచేసే టోరీ ల్యాండ్ అనే యువతి తెలిపింది. ఆమె ఒక హార్డ్ వేర్ స్టోర్ కూడా నడుపుతోంది.

ఫర్న్‌డేల్ పట్టణంలోని హంబోల్ట్ కౌంటి యురేకా ప్రాంతంలో కూడా ఎటువంటి ప్రాణనష్టం, భారీ ఆస్తినష్టం జరగలేదని అక్కడ ఫైర్ డిపార్ట్‌మెంట్ లో పనిచేసే టాలియా ఫ్లోర్స్ అనే మహిళ తెలిపింది.

Also Read: ఇండియాను కాదని చైనా వెళ్లిన నేపాల్ కొత్త ప్రధాని.. బిఆర్‌ఐ ప్రాజెక్టుపై ఒప్పందం

భూకంపం రావడానికి ముందే క్యాలిఫోర్నియా, ఒరెగాన్ రాష్ట్రాల్లోని దాదాపు 47 లక్షల మందిని జాతీయ వాతావరణ విభాగం సునామి హెచ్చరికలు జారీ చేసింది. దీంతో బర్కలీ పోలీస్ డిపార్ట్‌మెంట్ సాన్ ప్రాన్సిసిస్కో బే ప్రాంతాలలో నివసించే ప్రజలందరూ ఇళ్లు వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే రెండు గంటల తరువాత సునామీ ప్రమాదం తప్పిందని సమాచారం అందించారు.

క్యాలిఫోర్నియా గవర్నర్ గెవిన్ న్యూసమ్ మాట్లాడుతూ.. తాను సునామీ, భకంపం గురించి విని ఆందోళన చెందానని.. అందువల్లే వెంటనే ఉత్తర్ క్యాలిఫోర్నియా ఎమర్జెన్సీ ప్రకటించి ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టమని ఆదేశించానని తెలిపారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×