E-Paper
Advertisement

Pushpa 2 Update : ఇద్దరు హీరోయిన్స్ తో ఐటెం సాంగ్ సెట్ చేసిన సుక్కు

Pushpa 2 Update : ఇద్దరు హీరోయిన్స్ తో ఐటెం సాంగ్ సెట్ చేసిన సుక్కు
Advertisement

Pushpa 2 Update :  ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్ లో సుకుమార్ ఒకరు. ఆర్య (Aarya) సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సుకుమార్ వరుసుగా సినిమాలు చేస్తూ స్టార్ డైరెక్టర్ అనిపించుకున్నారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అందరి దర్శకులు కంటే సుకుమార్ వర్క్ స్టైల్ వేరేగా ఉంటుంది. ఒకవేళ సుకుమార్ సినిమా ఫెయిల్ అయిన కూడా అది చాలామందికి నచ్చుతుంది. ఆ ఫెయిల్యూర్ కి కూడా ఒక డిగ్నిటీ ఉంటుందని చెప్పొచ్చు.

సుకుమార్ కెరియర్ లో వచ్చిన బెస్ట్ ఫిలిమ్స్ లో రంగస్థలం సినిమా అని చాలామంది చెబుతారు. కానీ పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తీసుకొచ్చింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా దర్శకుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు సుకుమార్. పుష్ప సినిమా సృష్టించిన సంచలనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా పుష్ప 2 సినిమా కూడా రానుంది. ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Advertisement

Also Read : Kiran Abbavaram About Pawan Kalyan : గ్యాంగ్ స్టార్ తో పాటు పవన్ కళ్యాణ్ ఆ జోనర్ లో సినిమా చేస్తే బాగుంటుంది

సుకుమార్ సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయి. సుకుమార్ (Sukumar) సినిమాలలో హీరోలు చాలా ఇంటెలిజెంట్ గా కనిపిస్తారు. అందుకే సుకుమార్ సినిమాని చాలామంది ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇకపోతే సుకుమార్ సినిమాల్లో కీలక పాత్ర పోషిస్తుంది ఐటెం సాంగ్. వాస్తవానికి సుక్కు సినిమాల్లో ఐటెం సాంగ్ అయిపోయిన తర్వాతే కథ ఇంకొంచెం సీరియస్ గా ముందుకు సాగుతుంది. ఈ ఐటెం సాంగ్ అనేది సుకుమార్ దర్శకత్వం వహించిన ఆర్య సినిమా అప్పటినుంచి ఉంది. ఆర్య సినిమాలో ఐటెం సాంగ్ పెట్టడం సుకుమార్ కు అసలు ఇష్టం లేదట. అయితే మణిరత్నం సినిమాల్లో ట్రైన్ సాంగ్ లాంటిది ఒక ఫీల్ గుడ్ జోష్ సాంగ్ కావాలనుకుంటే… ఆ సాంగ్ కాస్త “అ అంటే అమలాపురం’ అయిపోయింది. ఆ తర్వాత సుకుమార్ ప్రతి సినిమాలోని ఐటెం సాంగ్ కామన్ అయిపోయింది.

Advertisement

Also Read : Dulquar Salmaan : లక్కీ భాస్కర్ సినిమాలో వాడింది నా పర్సనల్ కార్ 

ఇప్పటివరకు సుకుమార్ చేసిన ప్రతి సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీత అందించాడు. అలానే సుక్కు సినిమా కోసం దేవి మంచి ఐటెం నంబర్స్ ఇస్తాడు. జగడం సినిమాలో 36,24. 100% లవ్ లో డియాలో డీయాలో. రంగస్థలం సినిమాలోని జిగేల్ రాణి. పుష్ప సినిమాలో ఊ అంటావా మామ. ఇలాంటి పాటలన్నీ కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఇప్పుడు పుష్ప టు లో కూడా ఒక ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. అయితే ఈ ఐటెం సాంగ్ లో ఇద్దరు హీరోయిన్స్ కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. పుష్ప టు (Pushpa 2) సినిమాలోని ఒక ఐటెం సాంగ్ లో శ్రీ లీలా (Sreeleela) కనిపించబోతున్నట్లు విశ్వసినీయ వర్గాల సమాచారం. శ్రీ లీలతోపాటు సమంత (Samantha) కూడా ఈ సాంగులో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. దీని గురించి త్వరలో అధికారక ప్రకటన రావాల్సి ఉంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×