BigTV English
Advertisement

Pushpa 2: జాతర సీక్వెన్స్.. థియేటర్లలో మహిళలకు పూనిన అమ్మవారు..!

Pushpa 2: జాతర సీక్వెన్స్.. థియేటర్లలో మహిళలకు పూనిన అమ్మవారు..!

Pushpa 2: ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) తాజాగా నటించిన చిత్రం ‘పుష్ప 2’. డిసెంబర్ ఐదవ తేదీన భారీ అంచనాల మధ్య దాదాపు 12 వేలకు పైగా థియేటర్లలో విడుదల అయింది.. రష్మిక (Rashmika) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాతలుగా వ్యవహరించారు. ‘పుష్ప’ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది ఈ సినిమా..మొదటి రోజు రూ.294 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా, రెండు రోజుల్లోనే రూ.400 కోట్ల క్లబ్లో చేరిపోయింది అని సమాచారం.


పూనకాలు తెప్పిస్తున్న అల్లు అర్జున్..

ఇకపోతే థియేటర్లలో అల్లు అర్జున్ నట విశ్వరూపాన్ని చూసి ఆడియన్స్ సైతం మైమరచిపోతున్నారు. మరొకసారి జాతీయ అవార్డు ఇచ్చేయొచ్చు అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.ఇప్పటికే పుష్ప సినిమాలో తన అద్భుతమైన నటన కనబరిచి, జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్, ఇప్పుడు మరొకసారి పూనకాలు తెప్పించారు అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో జాతర సీక్వెన్స్ లో మాతంగి గెటప్ లో బన్నీ నటన హైలెట్ అని చెప్పాలి. థియేటర్లలో ఈ సన్నివేశం పూనకాలు తెప్పిస్తోంది.


జాతర సీక్వెన్స్.. మహిళలలో పూనిన అమ్మవారు..

ఎంతలా ప్రేక్షకులను అలరించింది అంటే థియేటర్లలో ఈ సన్నివేశం వస్తున్నప్పుడు పలువురు మహిళలకు అమ్మవారు పూనింది. దీంతో పక్క సీట్లో ఉన్న వారు ఆ మహిళలను శాంతింప చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా పుష్ప టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్త చాలా వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా మహిళలలో అమ్మవారు పూనారు అంటే ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో అందరిని మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మొదటిసారి లేడీ గెటప్ లో అల్లు అర్జున్ విపరీతంగా పెర్ఫార్మన్స్ చేసి చూపించారు.

హిందీలో తొలిరోజే రూ.72 కోట్లు..

అనసూయ, ఫహద్ ఫాజిల్, సునీల్, జగపతిబాబు వంటి భారీ తారాగణం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. అంతేకాదు ఇందులో యంగ్ బ్యూటీ శ్రీ లీల ఐటమ్ సాంగ్ లో మెరిసింది. ఈ సినిమా రాబట్టిన కలెక్షన్స్ విషయానికి వస్తే.. హిందీలో తొలి రోజు రూ.72 కోట్ల వసూలు సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అటు ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్ళు రాబడుతూ అప్పటివరకు ఉన్న రికార్డ్స్ ను సైతం బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా వుండగా.. బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్ సినిమాలు ఫిక్స్ చేసిన టార్గెట్లను ఇప్పటివరకు ఏ హీరో కానీ , డైరెక్టర్ కానీ అందుకోలేకపోయారు. పైగా ఈ రెండు చిత్రాలకి ఒకే డైరెక్టర్ కావడం గమనార్హం. అయితే ఇప్పుడు ఆ డైరెక్టర్ ని అలాగే ఆ సినిమాల హీరోలను కూడా క్రాస్ చేస్తూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు సుకుమార్, అల్లు అర్జున్. మరి వీరిద్దరూ ఫిక్స్ చేసిన టార్గెట్ ను ఎవరు బ్రేక్ చేస్తారో చూడాలి.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×