నల్గొండ, నకిరేకల్, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలకు సాగు నీరందించడమే కాదు.. 107 గ్రామాలకు తాగునీరందించే ఈ ప్రాజెక్ట్‌కి.. ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తయింది. 2 మోటార్ల ద్వారా రిజర్వాయర్‌లో 70 శాతం నీటిని నింపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్ట్‌ని ప్రారంభించడంతో పాటు రిజర్వాయర్ దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా 500 కోట్ల వ్యయంతో కాలువ పనులు, మిగిలిన పెండింగ్ పనులు పూర్తి చేయనున్నట్లు.. ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
Also Read: మహేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు.. మరో 15 ఏళ్లు మాదేనంటూ
నల్గొండ శివారులోని పానగల్‌లో ఉన్న ఉదయసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి.. 0.3 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న బ్రాహ్మణవెల్లెం రిజర్వాయర్‌లో నీటిని నింపుతారు. పానగల్ నుంచి 7 కిలోమీటర్ల ఓపెన్ కాలువ, కట్టంగూరు మండలంలోని పిట్టంపల్లి దగ్గరున్న సొరంగ మార్గం నుంచి నీటిని తరలిస్తారు. బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్ట్ నుంచి కుడి, ఎడమ కాలువలు తవ్వి.. నల్గొండ, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో.. లక్ష ఎకరాలకు సాగు నీరు అందిస్తారు. సుమారు 7 వందల కోట్ల అంచనా వ్యయంలో.. దాదాపు 484 కోట్లు ప్రాజెక్ట్ నిర్మాణానికి, మిగిలిన మొత్తాన్ని భూసేకరణకు కేటాయించారు.