BigTV English

Pushpa 2:- పుష్ప 2 డిజిట‌ల్ రైట్స్ …రేటు వింటే షాకే!

Pushpa 2:- పుష్ప 2 డిజిట‌ల్ రైట్స్ …రేటు వింటే షాకే!

Pushpa 2:- ‘పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదే లే’ ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2 ది రూల్‌. గ‌త ఏడాది విడుద‌లైన పాన్ ఇండియా లెవ‌ల్లో సెన్సేష‌న‌ల్ హిట్ అయిన పుష్ప ది రైజ్ చిత్రానికి ఇది కొన‌సాగింపు. షూటింగ్ జ‌రుగుతుంది. సినిమా ఇంకా సెట్స్‌పై ఉండ‌గానే ఈ సినిమా థియేట్రిక‌ల్‌, నాన్ థియేట్రిక‌ల్ హ‌క్కుల కోసం పోటీ ఏర్ప‌డింది. తాజాగా సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు పుష్ప 2 మేర‌కు డిజిట‌ల్ రైట్స్‌కు ఓ రేట్ ఫిక్స్ చేశార‌ట‌.


ఇంత‌కీ నిర్మాత‌లు పుష్ప ది రూల్ కోసం ఫిక్స్ చేసిన డిజిట‌ల్ హ‌క్కులు రేటు ఏంతో తెలిస్తే క‌ళ్లు తిరుగుతాయి. ఏకంగా రూ.200 కోట్లు డిమాండ్ చేశార‌ట‌. ఇంత భారీ మొత్తం నిర్ణ‌యించిన‌ప్పటికీ ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ పుష్ప 2 డిజిట‌ల్ రైట్స్ కోసం చ‌ర్చ‌లు జ‌రుపుతుంది. త్వ‌ర‌లోనే పుష్ప 2 డిజిట‌ల్ రైట్స్‌కు సంబంధించిన ఓ నిర్ణ‌యం తీసుకోబోతున్నారు. రేటు ఆటో ఇటో ఫిక్స్ అవుతుంద‌ని సినీ సర్కిల్స్ టాక్‌. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ ఫుట్టినరోజు. దీని కంటే ఓ రోజు ముందు అంటే ఏప్రిల్ 7న పుష్ప 2 మూవీ నుంచి మేకింగ్ వీడియోను విడుదల చేయబోతున్నట్లు టాక్.

పుష్ప ది రైజ్ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన త‌ర్వాత పుష్ప 2 మూవీపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ క్రియేట్ అయ్యాయి. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ఫ‌హాద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా బ్యానర్స్‌పై పుష్ప సినిమాను నిర్మిస్తున్నారు.


పాలిటిక్స్‌పై విజ‌య్ సేతుప‌తి కామెంట్స్‌

for more updates follow this link:-Bigtv

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×