Indian Railways: బీహార్ లో ఓ వ్యక్తి తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి జారి పట్టాల మీద పడిపోయాడు. ఈ ఘటనను చూసి ఇతర ప్రయాణీకులు షాక్ కు గురయ్యారు. ఆయన కచ్చితంగా చనిపోయి ఉంటాడని భావించారు. కానీ, రైలు వెళ్లాక చూస్తే స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. నిజంగా ఆయన అదృష్టవంతుడు అంటూ అందరూ కొనియాడారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
బీహార్ లోని సమస్తిపూర్ రైల్వేస్టేషన్ లోకి సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు వచ్చి ఆగింది. అప్పటికే ప్రయాణీకులు రైలు ఎక్కారు. నెమ్మదిగా రైలు ముందుకు కదులుతుండగా, ఓ వ్యక్తి రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. పట్టుతప్పి ఫ్లాట్ ఫారమ్ నుంచి జారి పట్టాల పక్కన పడిపోయాడు. ఈ ఘటనను చూసి రైల్వే స్టేషన్ లోని తోటి ప్రయాణీకులు ఆందోళన చెందారు. కానీ, సదరు వ్యక్తి ఫ్లాట్ ఫారమ్ గోడ, రైలు పట్టాల మధ్యలో ఉన్న స్థలంలో పడిపోయాడు. దీంతో స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. రైలు ముందుకు వెళ్లగానే కొంత మంది ప్రయాణీకులు దిగి అతడిని ఫ్లాట్ ఫారం మీదకి తీసుకొచ్చారు. అనంతరం ఆ వ్యక్తిని రైలు ఎక్కించారు. ఆ తర్వాత రైలు అక్కడి నుంచి బయల్దేరింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువు నెటిజన్లు ఆయన లేచిన వేళ బాగుందంటున్నారు. అందుకే ప్రాణాలతో బయటపడ్డాడు అంటున్నారు.
समस्तीपुर स्टेशन पर सांसें थम जाने वाला मंजर! 🚨
समस्तीपुर स्टेशन पर बिहार संपर्क क्रांति ट्रेन में चढ़ते वक्त युवक का पैर फिसल गया और वह पटरी व प्लेटफॉर्म के बीच फंस गया।
पल भर के लिए लगा हादसा टालना नामुमकिन है, लेकिन किस्मत ने उसका साथ दिया और वह बाल-बाल बच गया।#Samastipur… pic.twitter.com/HBCdWxdZgY
— Patna Pulse (@Patna_Pulse) December 21, 2024
Read Also: స్పెషల్ కోటాలో టికెట్ బుకింగ్, కచ్చితంగా కన్ఫర్మ్ కావాల్సిందే! ఇలా ట్రైచేయండి!
కోతుల మధ్య కొట్లాటతో రైళ్ల రాకపోకలకు అంతరాయం
ఇక రీసెంట్ గా రెండు కోతుల మధ్య గొడవ జరగడంతో సమస్తిపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్‌లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇదే స్టేషన్ లోని 4వ నెంబర్ ఫ్లాట్ ఫారమ్ మీద రెండు కోతులకు ఓ అరటి పండు దొరికింది. ఈ పండు కోసం రెండు కోతులు కొట్లాడుకున్నాయి. అందులో ఓ కోతి అరటిపండును తీసుకొని స్టేషన్ మీదికి ఎక్కింది. దాని వెనకాలే మరో కోతి వెళ్లింది. ఆ అరటి పండు కోతి చేతిలో నుంచి జారీ విద్యుత్ వైర్ల మీద పడిపోయింది. ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగింది. తీగల మీద నిప్పు రవ్వలు చెలరేగాయి. వైర్ల నుంచి పొగలు వచ్చాయి. వెంటనే రైల్వే అధికారులు కరెంటు సరఫరా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సుమారు గంట సమయం తర్వాత విద్యుత్ వైర్లను సరిపోయడంతో మళ్లీ యాథావిధిగా రైళ్ల రాకపోకలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్ పరిధిలో కోతులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రైల్వే స్టేషన్ అధికారులు కోతులు రాకుండా చర్యలు చేపట్టారు. ఈ ఘటన జరిగిన కొద్ది వారాల్లోనే మరో ఘటన జరగడంతో ఈ రైల్వే స్టేషన్ దేశ వ్యాప్తంగా మార్మోగుతోంది.
Read Also: జనరల్ జోలికి వెళ్లొద్దు.. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కీలక సిఫార్సులు!