BigTV English

Pushpa 2 The Rule: పెంచు.. పెంచు.. హైప్ తో జనాలు చచ్చిపోవాలా..?

Pushpa 2 The Rule: పెంచు.. పెంచు.. హైప్ తో జనాలు చచ్చిపోవాలా..?


Pushpa 2 The Rule: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. మూడేళ్ళ క్రితం వచ్చిన పుష్పకు సీక్వెల్ గా పుష్ప 2 తెరకెకెక్కుతుంది. పుష్ప రాజ్ గా బన్నీ తప్ప ఇంకెవరు చేయలేరు అనేంతగా బన్నీ నటించాడు. ఇక ఈ సినిమాకు జాతీయ అవార్డును కూడా అందుకున్నాడు. దీంతో పుష్ప 2 పై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక మైత్రీ మూవీ మేకర్స్ సైతం ఆ హైప్ ను రోజురోజుకు పెంచుతున్నారు కానీ తగ్గించడం లేదు.

ఆగస్టు 15 న ఈ సినిమా రిలీజ్ అవుతున్న విషయం తెల్సిందే. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఏప్రిల్ నుంచే పుష్ప మాస్ జాతరను మేకర్స్ మొదలుపెట్టేశారు. అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా ఏప్రిల్ 8 న పుష్ప 2 టీజర్ రాబోతుంది. ఇక నేడు రష్మిక పుట్టినరోజు కావడంతో ఆమె పోస్టర్ రిలీజ్ చేసి బర్త్ డే విషెస్ చెప్పిన మేకర్స్.. టీజర్ రిలీజ్ అయ్యేవరకు రోజుకో పోస్టర్ రిలీజ్ చేస్తూ మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. నిన్నటికి నిన్న త్రిశూలాలు ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేయగా.. ఈరోజు త్రిశూలం పట్టుకున్న పుష్పరాజు పోస్టర్ ను రిలీజ్ చేశారు.


ఇక ఈ పోస్టర్ లో అమ్మవారి గెటప్ లో ఉన్న బన్నీ.. ఒకచేత్తో త్రిశూలం పట్టుకొని ఇంకోచేత్తో శంఖం ఊదుతున్నట్లు కనిపించాడు. బన్నీ ముఖం కనిపించకుండా కుంకుమతో నింపేశారు. అయినా ఎరుపెక్కిన బన్నీ కళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈపోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ పోస్టర్ చూసిన అభిమానులు పెంచు.. పెంచు.. హైప్ తో జనాలు చచ్చిపోవాలా..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. పోస్టర్స్ తోనే హైప్ పెంచేస్తున్న మేకర్స్ టీజర్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తారేమో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×