BigTV English

Shocking Video Of King Cobra Summer Thirst: నీ దైర్యానికి హ్యాట్సాఫ్.. కింగ్ కోబ్రా దాహాన్ని తీర్చావ్ బ్రో.. వైరల్ వీడియో!

Shocking Video Of King Cobra Summer Thirst: నీ దైర్యానికి హ్యాట్సాఫ్.. కింగ్ కోబ్రా దాహాన్ని తీర్చావ్ బ్రో.. వైరల్ వీడియో!


Shocking Video Of King Cobra Summer Thirst: పాముల పేరు వింటేనే వణికిపోతుంటాం. అందులోను విషపూరితమైన పాముల జాతికి చెందిన కింగ్ కోబ్రా పేరు వింటే ఇక క్షణాల్లో అక్కడి నుండి పరుగులు పెట్టాల్సిందే. అయితే పాములు అయినా అవి కూడా జీవించడానికే కదా ఎదుటి వాటిని చంపుతాయి. వేసవి కాలం వస్తే చాలు నీటి కొరత ఏర్పడుతుంది.

మనుషులకే నీళ్లు దిక్కులేకుండా పోతున్న పరిస్థితులు కూడా ఏర్పడుతుండడం చూస్తూనే ఉన్నాం. ఎండాకాలంలో చెరువులు, నదులు ఎండిపోయి జీవరాశులకు నీటి సమస్య తలెత్తుతుంది. వాటి దాహన్ని తీర్చుకోలేక చాలా జీవాలు వేసవిలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చూస్తూనే ఉన్నాం. ఈ తరుణంలో దాహంతో ఇళ్ల బాట పట్టిన ఓ కింగ్ కోబ్రా దాహాన్ని ఓ వ్యక్తి తీర్చిన వీడియో వైరల్ అవుతోంది.


ఎండాకాలం కాబట్టి పాములు, జంతువులు దాహాన్ని తీర్చుకునేందుకు ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయి. అయితే అది అర్థం కాక చాలా మంది వాటిని చంపడం, తరిమికొట్టడం లాంటివి చేస్తుంటారు. అయితే ఈ తరుణంలోనే ఓ ఇంట్లోకి ప్రవేశించిన కింగ్ కోబ్రా దాహంతో ఉందని అర్థం చేసుకున్న ఓ వ్యక్తి.. దాని దాహాన్ని తీర్చాడు. కోబ్రా ఇంటి వద్ద ఉన్న పంపు వద్దకు వచ్చి నీటి కోసం వెతుకులాట మొదలుపెట్టింది.

Also Read: King Cobra Kissing Video: పడగ విప్పిన కింగ్ కోబ్రా తలపై ముద్దుపెట్టిన సురేష్.. భయానకమైన వీడియో!

దీనిని గమనించిన ఓ వ్యక్తి భయం కంటే ముందు దాని దాహం తీర్చాలన్న ఆలోచనతో ముందుకెళ్లాడు. ఇక అక్కడే ఓ బకెట్ లో ఉన్న వాటర్ ను కింగ్ కోబ్రాకు తాగించాడు. మొదట కోబ్రాకు నీటిని తాగించగా.. ఆ తరువాత అది దాహం తీర్చుకుని వెనుతిరిగింది. అయితే నీరు మిగలడంతో ఆ వ్యక్తి మిగిలిన నీటిని పాము తలపై పోసి చల్లబర్చాడు. కోబ్రా కూడా ఆ వ్యక్తిని ఏం అనకుండా తన దాహాన్ని తీర్చినందుకు కృతజ్ఞతతో వ్యవహరించింది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పాము అనే భయం లేకుండా మంచి మనసుతో కోబ్రా దాహాన్ని తీర్చినందుకు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్, ఇన్ స్టాగ్రాం, యూట్యూబ్ లలో వైరల్ అవుతోంది. ఎండాకాలంలో వన్య ప్రాణుల దాహాన్ని తీర్చాలని ఓ మంచి మెసేజ్ ఇచ్చాడు.

Tags

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×